Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!

www.mannamweb.com


పెరుగుతోన్న బంగారం ధరతో సామాన్యులు బెంబలెత్తుతున్నారు. ప్రస్తుతం సామాన్యులు బంగారం కొనలేని పరిస్థితి ఏర్పడింది. ధరలు అంతగా పెరిగిపోయాయి. బంగారంపై పెట్టుబడి సురక్షితమని భావించిన పెట్టుబడిదారులు పుత్తడిపై పెట్టుబడి పెడుతున్నారు. మరోవైవు పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశీయంగా బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో స్వర్ణం ధర పరుగులు పెడుతోంది. శనివారం హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.74,350 గా ఉంది.

10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68,160గా ఉంది. ఇక వెండి ధర కిలో 89,900 పైగా కొనసాగుతోంది. బంగారం ధర పెరగడానికి అంతర్జాతీయ కారణాలు ప్రభావం చూపుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో మధ్యప్రాచ్య ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తత మధ్య, బంగారం ధరలు వరుసగా ఆరవ వారంలో అధిక స్థాయికి చేరుకున్నాయి. ఆసక్తికరంగా యూఎస్ డాలర్ ధరలు పెరుగుతున్నప్పటికీ, సురక్షితమైన స్థావరం డిమాండ్‌తో బంగారం, వెండి ధరలు పెరిగుతోన్నాయి.

కమోడిటీ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇరాన్‌లో ఇజ్రాయెల్ చేసిన డ్రోన్ వైమానిక దాడుల గురించి ఆరోపించిన నివేదికల తర్వాత మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక-రాజకీయ ప్రమాదం కారణంగా ఈ రోజు బంగారం ధర అప్‌ట్రెండ్‌లో ఉంది. ఇరాన్-ఇరాక్ యుద్ధ భయం, పెరుగుతున్న యూఎస్ డాలర్ రేట్లు కారణంగా పుత్తడి ధర పెరుగుతోంది. అయితే MCX బంగారం ధర ఈరోజు 10 గ్రాముల విస్తృత పరిధి రూ.72,300 నుంచి రూ. 73,300 వరకు ఉందని నిపుణులు పేర్కొన్నారు.