బంగారం ధరలు రికార్డు స్థాయి నుంచి తగ్గుతున్నాయి. అక్టోబర్ 25వ తేదీ శనివారం పసిడి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,27,732 పలుకుతోంది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,14,400 పలుకుతోంది. ఒక కేజీ వెండి ధర రూ. 1,54,859 పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర స్థిరంగా ఉంది అని చెప్పవచ్చు. కానీ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర తగ్గుముఖం పడుతోంది. అమెరికాలో ఒక ఔన్స్ బంగారం ధర 4370 డాలర్ల గరిష్ట స్థాయి నుంచి 4100 డాలర్లకు పతనం అయ్యింది. ముఖ్యంగా బంగారం ధరలు తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్నటువంటి పరిస్థితులు కారణంగా చెప్పవచ్చు. డాలర్ విలువ బలపడటంతో పాటు ఇతర కారణాలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి.
అమెరికా ఇన్ ఫ్లెషన్ డేటా అంచనాల కంటే కొద్దిగా తక్కువగా రావడంతో పాటు, ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్ కారణంగా ధరలు తగ్గాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు చైనా అధ్యక్షుడు షిజిన్ పింగ్, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్య వచ్చేవారం భేటీ జరగనుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లలో ఉత్కంఠత నెలకొని ఉందని చెప్పవచ్చు. దీనికి తోడు అమెరికా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంచనాల కంటే తక్కువగా నమోదు అయ్యింది. ఈ కారణాలు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ మేరకు ప్రముఖ బిజినెస్ వెబ్ పోర్టల్ సీఎన్బీసీ తాజా వార్తా కథనంలో తెలిపింది. ఇదిలా ఉంటే మరోవైపు బ్లూలైన్ ఫ్యూచర్స్ విశ్లేషకుడు ఫిలిప్స్ స్టెరిబుల్ మాట్లాడుతూ బంగారం ధర 4000 డాలర్ల కన్నా దిగివస్తే, తర్వాతి ప్రధాన సపోర్ట్ లెవెల్ 3850 డాలర్ల వద్ద ఉంటుందని అంచనా వేశారు.
బంగారం ధరలు తగ్గుతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలా వద్దా అనే సందేహం చాలా మందిలో నెలకొని ఉంది అని చెప్పవచ్చు.ముఖ్యంగా బంగారం ధరలు తాజాగా వచ్చినటువంటి కరెక్షన్ స్వల్పకాలికమని, దీన్ని ఒక టెక్నికల్ కరెక్షన్ గా భావించాల్సి ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా ఈ స్థాయి నుంచి బంగారం ధరలు భవిష్యత్తులో రికవరీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారం ధరలు అంతర్జాతీయ జియో పొలిటికల్ సిట్యువేషన్స్ కనుక సద్దుమణిగినట్లయితే మాత్రం భవిష్యత్తులో బంగారం ధరలు తగ్గి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. దీనికి తోడు బంగారానికి ప్రత్యామ్నాయంగా ఇతర అసెట్ క్లాసెస్ విలువ పెరిగినట్లయితే బంగారం ధరలు తగ్గే వీలుందని నిపుణులు చెబుతున్నారు.






























