భారీగా పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే.

మరోసారి షాక్ ఇచ్చిన గోల్డ్ రేట్స్.. తగ్గాయని మీరు అనుకుంటున్న సమయంలోనే బంగారం ధర భారీగా పెరిగింది.. గత వారం రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.700 పెరిగి రూ.80,100కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.760 పెరిగి రూ.87,380కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.2000 పెరిగి ఇప్పటికీ రూ.1,07,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో ఈ ధరలు కొనసాగుతున్నాయి.