Gold Rate: బంగారం కొనాలంటే ఇప్పుడే త్వరపడండి.. భారీగా దిగొచ్చిన ధరలు

www.mannamweb.com


బంగారం పేరు వినబడితే చాలు భారతీయుల్లో ఒక లాంటి వైబ్రేషన్‌ కనిపిస్తుంది. ఇక ఆడవారి గురించి అయితే చెప్పక్కర్లేదు. భారతీయ మహిళలకు గోల్డ్‌ అంటే ఎంతో మోజో..

మన దగ్గర జరిగే పసిడి కొనుగోళ్లు చూస్తే అర్థం అవుతుంది. ధర ఎంత భారీగా పెరిగినా.. మనవాళ్లు పుత్తడి కొనడం మాత్రం ఆపరు. ఇక పండగలు, పబ్బాలు, వివాహాది శుభకార్యల వేళ ఈ జోరు మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొనుగోళ్లు మరింత పెరుగుతాయి. వివాహం అంటే చాలు ఎంత పేదవారైనా సరే.. అప్పు చేసైనా ఎంతో కొంత పసిడి కొంటారు. ఇక గత కొన్నాళ్లుగా మన దేశంలో గోల్డ్‌ రేటు రాకెట్‌ కన్నా వేగంగా దూసుకుపోతుంది. పది గ్రాములు పుత్తడి ధర 70 వేలకు పైగా చేరింది. కొన్ని రోజుల వరకు దూసుకుపోయిన బంగారం ధర.. ఇప్పుడు దిగి వస్తుంది. ఇక ఆదివారం నాడు ఒక్క రోజే ఏకంగా 2000 రూపాయల మేర పడిపోయింది. ఇక నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..

ఆదివారం నాడు గోల్డ్‌ రేటు దిగి రాగా.. సోమవారం నాడు అది స్థిరంగా కొనసాగింది. ఇక నేడు హైదరాబాద్‌లో పసిడి రేటు స్థిరంగా ఉంది. ఆదివారం నాడు క్యారెట్‌ మేలిమి బంగారం ధర పది గ్రాముల మీద రూ. 2080 మేర దిగి వచ్చిన సంగతి తెలిసిందే. నిక నేడు అనగా సోమవారం నాడు.. 24 క్యారెట్‌ పసిడి రేటులో ఎలాంటి మార్పు లేకుండా రూ. 71,670 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ రేటు నిన్న 10 గ్రాముల మీద రూ.1900 తగ్గింది. ఇక సోమవారం నాడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ పసిడి పది గ్రాముల రేటు రూ. 65,700 వద్ద స్థిరంగా కొనసాగుతోంది..

ఇక దేశరాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర దిగి వచ్చింది. నేడు హస్తిన బులియన్‌ మార్కెట్‌లో10 గ్రాముల 22 క్యారెట్‌ పసిడి రేటు10 గ్రాముల రేటు రూ. 65,850 వద్ద ట్రేడ్ అవుతోంది. అలానే ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా స్థిరంగానే ఉంది. నేడు ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 71,820 వద్ద అమ్ముడవుతోంది.

బంగారం బాటలోనే వెండి..

ఇక ఈ ఏడాది వెండి ధర భారీగా పెరిగింది. కిలో ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. అయితే క్రితం సెషన్‌లోగోల్డ్‌ రేటు 2000 రూపాయలు దిగి రాగ.. సిల్వర్‌ రేటు కూడా కిలో మీద ఏకంగా 4500 రూపాయలు దిగి వచ్చింది. నేడు అనగా సోమవారం నాడు వెండి ధరలో ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. నేడు హైదరాబాద్‌లో కిలో వెడి ధర 96 వేల మార్క్‌ వద్ద ట్రేడ్‌ అవుతోంది. అలానే ఢిల్లీ మార్కెట్‌లో కిలో వెండి రేటు 91,500 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీతో పోలిస్తే హైదరాబా్‌దలో బంగారం, వెండి ధరల్లో స్వల్ప మార్పు ఉంటుంది. స్థానికంగా ఉండే పన్నులే ఇందుకు కారణం.