Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధర.ఎంత తగ్గిందంటే ?

Gold Rates: మహిళలకు శుభవార్త.. నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. నిన్న తగ్గిన బంగారం ధరలు నేడు మళ్లీ స్వల్పంగా తగ్గాయి. బంగారం గురించి మనం ఎంత మాట్లాడినా, అది తక్కువగానే ఉంది.


బంగారం… ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. కానీ మన దేశంలో.. దాని డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. ఏ చిన్న పండుగ జరిగినా… మహిళలు బంగారం, వెండి కొనడానికి చాలా ఆసక్తి చూపుతున్నారు.

బంగారం
ఇది జరుగుతుండగా, ఇటీవల బంగారం ధరలు బాగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… నేడు, హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 86,080కి చేరుకుంది. అదే సమయంలో, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 78,890కి చేరుకుంది. వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి. దీనితో, కిలో వెండి ధర రూ. 100 తగ్గి 1,07,900గా నమోదైంది.