Gongadi Trisha: ఫ్రాంచైజీల నోర్లు మూయించిన తెలుగు బిడ్డ త్రిష

వరల్డ్ కప్‌లో స్టార్‌ ఫార్మర్‌గా నిలిచిన త్రిష(Gangodi Trisha)ని మాత్రం అసలు కన్నెత్తైనా చూడలేదు. ఇప్పుడు జరుగుతున్నా విమెన్స్ ప్రీమియర్ లీగ్‌కు గతంలో జరిగిన ఆక్షన్‌లో ఏ ఒక్క జట్టు కూడా త్రిషని తమ టీమ్‌లో కొనడానికి ఇష్టపడకపోవడం విడ్డూరం.


ఇండియన్ క్రికెట్‌లో స్టార్స్‌కి కొదవ లేదు. మెన్స్‌ క్రికెట్ అయినా, విమెన్స్‌ క్రికెట్ అయినా ఇన్సిపిరేషన్‌గా తీసుకోడానికి చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరన్నా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తే ఆ కిక్కు నెక్ట్స్‌ లెవల్‌. అలాంటి కిక్కును తెలుగు వాళ్ళకి రీసెంట్‌గా అందించిన ఘనత తెలంగాణ బిడ్డ గొంగడి త్రిష(Gangodi Trisha)కే దక్కుతుంది. విమెన్స్ అండర్‌-19 టీ20 వరల్డ్ కప్‌లో త్రిష 309 రన్స్ చేసింది. 77 .25 యావేరేజ్‌తో దుమ్మురేపారు. టోర్నమెంట్‌లో ఇండియా విజయం సాధించడంలో ఆమెదే కీ రోల్.

సచిన్ టెండూల్కర్, MS ధోని, మిథాలీ రాజ్, తన ఫేవరెట్ ప్లేయర్స్ అంటూ చెప్పుకొచ్చే త్రిష(Gangodi Trisha)కి అండర్‌-19 టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కూడా కాస్త నిరుత్సాహమే మిగిలింది. ఎందుకంటే విమెన్స్‌ ప్రిమియర్‌ లీగ్‌లో త్రిష(Gangodi Trisha) ఆడడంలేదు. సాధారణంగా డొమెస్టిక్ సీజన్‌లో చెలరేగి ఆడే ప్లేయర్స్‌ను వదలని ఐపీఎల్(ipl) జట్లు, వరల్డ్ కప్‌(world cup)లో స్టార్ పెరఫార్మెర్‌గా నిలిచిన త్రిషని మాత్రం అసలు కన్నెత్తైనా చూడలేదు. ఇప్పుడు జరుగుతున్నా విమెన్స్ ప్రీమియర్ లీగ్‌(Women’s Premier League)కు గతంలో జరిగిన ఆక్షన్‌లో ఏ ఒక్క జట్టు కూడా త్రిషని తమ టీమ్‌లో కొనడానికి ఇష్టపడకపోవడం విడ్డూరం.

ఇలా టాలెంట్‌ని ప్రోత్సహించకపోతే వాళ్ళు డీలా పడే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో పాజిటివ్‌ థింక్‌ కూడా ఒకటి ఉంది. త్రిషపై ఇప్పుడే అనవసర ఒత్తిడి పెట్టవద్దని మిథాలీ రాజ్ కూడా అంటోంది. ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ని తీసుకోకపోవడం విమెన్స్ ప్రీమియర్ లీగ్ నష్టంగానే భావించాలి కానీ.. మిథాలీ రాజ్ సూచనలో లాజిక్ ఉంది. ఎక్కువగా ఒత్తిడికి గురైతే లాంగ్‌ టర్మ్‌లో ఆటపై ప్రభావం పడుతుంది. ముంబై క్రికెటర్ పృథ్వీ షా దీనికి మంచి ఉదాహరణ.

మరోవైపు ఫ్యాన్స్‌ ఆలోచన మాత్రం వేరేలా ఉంది. ఇలా ప్రపంచానికి తన ప్రతిభని చూపించిందో లేదో, అప్పుడే తనని ఎదగనివ్వకుండా తొక్కేస్తున్నారంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియర్ టీమ్‌కి ప్రమోట్ చేయకపోయినా, కనీసం విమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో త్రిషని ఆడనిచ్చి ఉంటే తెలుగు వాళ్ళకి ఎంతో ఆనందంగా ఉండేదని అభిప్రాయపడుతున్నారు.