రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ఫ్యామిలీ కార్డును జారీ చేయనున్నట్లు ప్రకటించింది.
క్యూ ఆర్ కోడ్‌తో కూడిన ఫ్యామిలీ కార్డును జారీ చేయనుంది సర్కార్. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారు పుట్టిన తేదీ, స్త్రీ, పురుషులా, వారి నివాసం ఐడీ నెంబర్‌తో కూడిన పూర్తి వివరాలతో ఫ్యామిలీ కార్డును ఏపీ సర్కార్ జారీ చేయనుంది.
కాగా ప్రతి కుటుంబ సాధికారతే లక్ష్యంగా రాష్ట్రంలో 1.40 కోట్ల కుటుంబాలకు 2026 జూన్ నాటికి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ ఫ్యామిలీ కార్డులు (Family Cards) జారీ చేయాలని సీఎం చంద్రబాబు గతంలో అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పౌరసేవలు, ప్రభుత్వ శాఖల వద్ద ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి, 25 రకాల వివరాలతో పాటు పీ4 (P4) లాంటి అంశాలనూ పొందుపరచాలని సూచించారు. సుపరిపాలనలో భాగంగా అర్హులైన వారందరికీ పథకాలతో పాటు సులభంగా పౌరసేవలు అందించాలనేదే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు వివరించారు.































