క్యాన్సర్ పేషెంట్లకు గుడ్ న్యూస్.. ఇప్పటివరకు క్యాన్సర్ చికిత్సలో వాడే మందులతో కొంత సైడ్ ఎఫెక్ట్స్, క్యాన్సర్ కణాలతోపాటు సాధారణ కణాలు నష్టపోయేవి..
కానీ శాస్త్రవేత్తలు ఇప్పుడు క్యాన్సర్ చికిత్స్ కొత్త రకం మందులను తయారు చేస్తున్నారు. మ్యాడ్సుల్ రూపొందించారు. ఇక మందుల తయారీ ఆలస్యం.. త్వరలో అందుబాటులోకి రానున్నట్లు చెబుతున్నారు. ఆ మందులు ఏమిటీ.. ? అవి క్యాన్సర్ కణాలపై పనిచేసే తీరు.. పూర్తి వివరాలు తెలుసుకుందాం..
కొన్ని రకాల క్యాన్సర్ కణాలకు జీవాధారం అయిన టెర్రా అనే RNA అణువును ఖచ్చితంగా నాశనం చేయగల ఓ కొత్త మందులను రూపొందించారు పరిశోధకులు. లేటెస్ట్ టెక్నాలజీ అయిన RIBOTAC అధునాతన పద్ధతిని ఉపయోగించి ఈ కొత్త డ్రగ్ కణాలలోని టెర్రాను వెతుకుతూ నాశనం చేస్తుంది. ఇది సాధారణ అణువులను తాకకుండా వదిలివేస్తుంది.ఈ డ్రగ్ డెవలప్ మెంట్ వ్యాధి లక్షణాలను మాత్రమే నిర్వహించడం కంటే వ్యాధి జన్యుపరమైన కారణాలను పరిష్కరించే కొత్త తరం RNA- ఆధారిత క్యాన్సర్ చికిత్సలకు నాంది పలుకుతుంది.
జెరూసలేం హిబ్రూ యూనివర్సిటీ పరిశోధకుల బృందం..ఈ ప్రత్యేక డ్రగ్ అణువును రూపొందించారు. క్యాన్సర్ అభివృద్ధికి సంబంధించిన RNA భాగాన్ని లక్ష్యంగా చేసుకుని దానిని నాశనం చేయగల సామర్థ్యం ఈ డ్రగ్ అణువుకు ఉంది.
అడ్వాన్స్‌డ్ సైన్సెస్‌లో ప్రచురించబడిన జర్నల్ లో యూనివర్సిటీ వైద్య విభాగం నుంచి డాక్టర్ రాఫెల్ I. బెన్‌హామౌ, ఎలియాస్ ఖాస్కియా దీపక్ దహతోండే ఈ పరిశోధన చేశారు. కొన్ని రకాల క్యాన్సర్ కణాలకు జీవాధారం అయిన టెర్రాలక్ష్యంగా, క్రోమోజోమ్‌ల రక్షణ,DNAను రక్షించే నిర్మాణాలను రూపొందించే విధంగా వారు పరిశోధన జరిపారు. కొన్ని రకాల దూకుడు క్యాన్సర్లు అంటే మెదడు, ఎముకల కు వచ్చే క్యాన్సర్లు చాలా వరకు టెర్రాపై ఆధారపడి పెరుగుతాయి. అందుకే పరిశోధకు టెర్రా టార్గెగ్ గా పరిశోధనలు చేశారు.
RIBOTAC అంటే.. అది ఎలా పనిచేస్తుంది..?
RIBOTAC అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ డ్రగ్ అణువును రూపొందించింది పరిశోధకుల బృందం. RIBOTAC అంటే Ribonuclease-Targeting Chimera .ఈ అణువు TERRA తినే క్యాన్సర్ కణాలను గుర్తించగలదు. – దీనిని G-క్వాడ్రప్లెక్స్ అని పిలుస్తారు. ఆ తర్వాత RNA ను నాశనం చేసేందుకు సహజ కణ ఎంజైమ్, RNase L ను RIBOTAC ఎంటర్ చేస్తుంది.
శాస్త్రవేత్తలు టెర్రాను ఇంత ఖచ్చితంగా నాశనం చేయడం ఇదే మొదటిసారట. ఆ అణువు టెర్రాను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఇలాంటి ఇతర RNAలను తాకకుండా వదిలివేస్తుంది.
HeLa ,U2OS కణాలతో సహా క్యాన్సర్ కణ శ్రేణులలో పరీక్షించినప్పుడు చికిత్స TERRA స్థాయిలను తగ్గించింది. క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకుంది. ఇది వైద్య చరిత్రలో కొత్త అధ్యాయం.. కొత్త మార్గం అని పరిశోధకులలో ఒకరైన బెన్ హామౌ చెబుతున్నారు. క్యాన్సర్ చికిత్సలో ప్రోటీన్లపై మాత్రమే దృష్టిపెట్టకుండా వాటిని కంట్రోల్ చేసే RNA ను లక్ష్యంగా చేసుకొని కొత్త రకం చికిత్స అందుబాటులోకి తీసుకొస్తున్నామని అంటున్నారు
































