కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త… త్వరలో డీఏ అవకాశాలు ప్రకటించబడతాయి…

 కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సంవత్సరం రెండోసారి డీఏ ప్రకటించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఏడాది ఒకసారి డిఏ రెండు శాతం పెంచారు. రెండోసారి కూడా డిఏ పెంచే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. . అలాగే ఎంత శాలరీ పెరుగుతుందో అంచనా వేద్దాం.

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించింది అయితే ఇంకా దీనికి సంబంధించిన కసరత్తు ప్రారంభం కాలేదు. . అయితే అంతకన్నా ముందే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర ఉద్యోగులు పెన్షనర్లు జూలై లో డీఏలో పెంపుదల లభిస్తుందని ఆశిస్తున్నారు. మార్చి 2025 కి విడుదల చేసిన వినియోగదారుల ధరల సూచిక (CPI-IW) 0.2 పాయింట్ల పెరుగుదలను నమోదు చేసి 143.0 కి చేరుకుంది. ఇది జనవరి నెలలోని 143.2 కంటే కొంచెం తక్కువగా ఉంది. జూలైలో DA 2% నుండి 3% వరకు పెరగవచ్చని ఈ సూచిక సూచిస్తుంది.
ఇదిలా ఉంటే జనవరి నుండి జూన్ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం DA ని కేవలం 2% పెంచింది. ఈ మొత్తం గడిచిన 78 నెలల్లోనే అత్యల్పంగా చెప్పవచ్చు. అయితే ఈ పెంపుదల అనంతరం DA ప్రస్తుతం 55% వరకూ చేరుకుంది. ప్రతి ఏడాది రెండుసార్లు అంటే జనవరి, జూలై నెలల్లో డీఏ సవరిస్తారు. ఇప్పుడు అందరి దృష్టి జూలై-డిసెంబర్ పై ఉంది. 7వ వేతన సంఘం పదవీకాలం డిసెంబర్ 31, 2025తో ముగియనుంది. దీంతో ఇది చివరి డీఏ పెంపు అవుతుంది. ఒకవేళ డిఏ 2 శాతం పెరిగినట్లు అయితే అప్పుడు మొత్తం డీఏ 58 శాతం అవుతుంది. ఉదాహరణకు 18 వేల రూపాయల బేసిక్ శాలరీపై డిఏ కలిపినట్లయితే 10,440 రూపాయలు అదనంగా లభిస్తాయి. ఒకవేళ డిఏ పెంపుదల 2 శాతం అయితే మొత్తం డీఏ 57 శాతం చేరుకుంటుంది. అప్పుడు కనీస వేతనం 18000 రూపాయలపై రూ. 10,260 వేతనం డీఏ కింద అదనంగా లభిస్తుంది.
ఇదిలా ఉంటే ఎనిమిదో పే కమిషన్ విషయంలో ఇంకా కమిషన్ ఏర్పాటు అదేవిధంగా చైర్మన్ ఎంపిక సభ్యుల ఎంపిక పూర్తి కాలేదు. . ఈ నేపథ్యంలో ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు అనేవి కేంద్ర ప్రభుత్వానికి ఈసారి ఆలస్యంగా చేతికి అందే అవకాశం ఉంటుంది. ఏడవ వేతన సంఘం సవరణ సిఫార్సులు డిసెంబర్ 31, 2025తో ముగియనున్నాయి. . అయితే నూతన ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సులు జనవరి 1, 2026 వ సంవత్సరం నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇది ఆలస్యమే అవకాశం కనిపిస్తోంది.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.