మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. రాష్ట్రంలోని మద్యంషాపుల వద్ద పర్మిట్ రూములు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అందుకుగాను మంగళవారం ఎక్సయిజ్ రూల్-2024 కు సవరణ చేసింది. వైన్ షాపుల వద్ద పర్మిట్ రూములు లేకపోవడంతో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ గత రెండేళ్ళలో 2.77 లక్షల కేసులు నమోదయ్యాయని ఎక్సయిజ్ శాఖ పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లగా.. వైన్స్ వద్ద పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల పక్కన, పార్కుల్లో మద్యం తాగడాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పేర్కొంది.
































