రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ చెల్లింపునకు ముహూర్తం ఫిక్స్..!

రైతులకు గుడ్ న్యూస్.. రుణమాఫీ చెల్లింపునకు ముహూర్తం ఫిక్స్..!


ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీపై తీవ్ర కసరత్తు చేస్తోంది. రుణమాఫీ సొమ్మును జులై 15 నుంచి ఆగస్టు 15 వరకూ దశల వారీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఫస్ట్ రూ.50వేల లోపు వారికి ఈ ప్రక్రియ మొదలై ఫండ్స్ అవైలబులిటీని బట్టి రూ.75 వేలు, రూ.లక్షకు క్రమంగా పెంచుతూ బ్యాంకులకు జమచేసే సిస్టమ్‌ను గవర్నమెంట్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. రైతుల్లో 70 శాతం మందికి రూ.లక్షలోపే రుణాలు ఉన్నట్లు అంచనా వేసిన సర్కారు తొలిదశలో వీరందరికి మాఫీ చేయాలని యోచిస్టున్నట్లు తెలుస్తోంది. మిగిలిన వారికి ఆగస్టు 15 లోగా జమచేస్తే ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది.

రైతు సంక్షేమ పథకాలకు 2 నెలల్లో కనీసం రూ.30వేల కోట్లు అవసరం అని అంచనాకు వచ్చిన ప్రభుత్వం రుణాల సేకరణకు ఉన్న అన్ని మార్గాలను అన్వేషిస్తోంది. రిజర్వు బ్యాంకును రుణాల విషయంలో సంప్రదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే సర్కారు భూములను తనఖా పెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.