గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఇకపై దానికి డబ్బులు కట్టాల్సిన పని లేదు!

www.mannamweb.com


ఇప్పుడు వంట గ్యాస్ లేని ఇల్లు లేదు అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. ఇప్పుడు ప్రతి మహిళ వంట గ్యాస్‌తోనే ఇంటిల్లిపాదికి వడ్డి వార్చుతోంది.

కట్టెల పొయ్యిలకు రాం రాం చెప్పి.. సులువుగా, త్వరగా వంట సిద్ధం చేసే కుకింగ్ గ్యాస్ పైనే ఆధారపడుతున్నారు. ఒకప్పుడు ఉన్న అపోహాలు తొలగిపోయి.. పల్లెటూళ్లు, కుగ్రామాల్లోని ప్రజలు సైతం గ్యాస్ వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఈ గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు గుడ్ న్యూస్ వెల్లడించాయి చమురు కంపెనీలు. ఈమేరకు కీలక ప్రకటన చేశాయి. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఉచిత సేవ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఇంతకు ఏం చేయనున్నాయంటే..?

మీకు గ్యాస్ కనెక్షన్ ఉందా.. అలాగే లీకేజ్, సేఫ్టీకి సంబంధించిన ఇతర అనుమానాలు ఉన్నాయా. కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంటి వద్దకే వచ్చి సేఫ్టీ చెక్ చేపట్టనున్నాయి దేశీయ ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. చమురు మార్కెటింగ్ సంస్థలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ కార్యక్రమం చేపట్టనున్నాయి. గ్యాస్ కనెక్షన్ పనిచేసే తీరు, లీకేజీని తనిఖీ చేస్తాయి. లోపాలు ఉంటే వెంటనే మార్చాలని చెబుతారు అక్కడకు వచ్చిన సిబ్బంది. అలాగే అవగాహన కూడా కల్పిస్తారు. గ్యాస్ పైప్, ఇతర పరికరాలు ఎన్నాళ్లు వాడాలి, ఎన్నాళ్లకు వాటిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత గురించి సిబ్బంది వెల్లడిస్తారు.

ఈ సర్వీస్ అంతా ఉచితంగానే అందించనున్నాయి చమురు సంస్థలు. గ్యాస్ డెలివరీ చేసేందుకు వచ్చిన సిబ్బంది.. అదే సమయంలో 8 భద్రతా నిబంధనల ప్రకారం గ్యాస్ కనెక్షన్ చెక్ చేస్తారని పేర్కొన్నాయి. అలాగే 8 భద్రతా నిబంధనలపైనా కస్టమర్లకు అవగాహన కల్పిస్తారు. ప్రతి వినియోగదారుడు ఐదేళ్లకు ఒకసారి గ్యాస్ రెగ్యులేటర్, గ్యాస్ పైపు, ఇన్ స్టా లేషన్ వంటి పరికరాలను సేఫ్టీ చెక్ చేయించుకోవాలంటే.. రూ. 200 వరకు చార్జీలు వసూలు చేశాయి. దీనికి 18 శాతం జీఎస్టీ కూడా ఉండేది. ఇప్పుడు ఈ సేవలు పూర్తిగా ఉచితం. సేప్టీ చెకింగ్ లో కాషాయ రంగు పైపు పనికి రాదని తేలితే వెంటనే రూ. 150 చెల్లించి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ సేఫ్టీ చెకింగ్ అనేది ఢిల్లీతో సహా వివిధ ప్రాంతాల్లో ప్రారంభమైంది. రానున్ననెలల్లో దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది గ్యాస్ వినియోగదారుల ఇళ్లకు చేరుకోవాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నాయి.