చేనేత కార్మికులకు మంత్రి సవిత గుడ్ న్యూస్ చెప్పారు. నేతన్నలకు సబ్సిడిపై ముడి సరుకు పనిముట్లు ఇస్తామని తెలిపారు. సొసైటీలు ఏర్పాటు చేసి చేనేత కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
జగన్ సీఎం అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారని మండిపడ్డారు. వైసీపీ పాలనలో ఆప్కో, చేనేతలో భారీగా కుంభకోణాలు జరిగాయని.. వాటన్నింటిపై విచారణ జరిపిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఆప్కో, చేనేత కార్మికులను స్వలాభం కోసం వైసీపీ నాశనం చేసిందని ఫైర్ అయ్యారు.
జగన్ తీరుతో చేనేత కార్మికులు ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారని.. ఏపీలో వైసీపీ చేనేత రంగాన్ని నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. నేతన్న పేరుతో కేవలం వైసీపీ కార్యకర్తలకే నేతన్న హస్తం ఇచ్చారని ఆమె మండిపడ్డారు. ఆప్కో, చేనేత రంగాల్లోని అవినీతిని ఒక్కొక్కటిగా వెలికి తీస్తామని తేల్చి చెప్పారు. వైసీపీ హయంలో జరిగిన కుంభకోణాలపై కచ్చితంగా విచారణ జరిపిస్తామన్నారు.