Andhra Pradesh: ఇల్లు నిర్మించుకునే వారికి గుడ్ న్యూస్.. రూ. 4 లక్షలు అందించనున్న ప్రభుత్వం
ఈ పథకం కింద కొత్త ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కచ్చితంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు…
ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఇంటి నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సమయం అందించనున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు (సోమవారం) గృహ నిర్మాణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. 2024-25 పీఎంఏవై-యు 2.0 పథకం డ్రాఫ్ట్ గైడ్లైన్స్ లో పెరిగిన ధరల ప్రతిపాదనలతో సమీక్ష నిర్వహించనున్నారు. కొత్త ఎంపిక చేసే లబ్ధిదారులకే ఈ పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఈ పథకం కింద కొత్త ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 4 లక్షలు అందించనున్నారు. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.2.50 లక్షలు అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటాగా కచ్చితంగా మరో రూ.1.50 లక్షలు ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈరోజు నిర్వహించే సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని సీఎంతో నివేదించనున్నారు. ఇదిలా ఉంటే పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పట్టణ ప్రాంతాల్లోని పేదలకు కోటి ఇళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థల్లోని పేదలకూ ఈ పథకం వర్తించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదిలా ఉంటే వైసీపీ హయాలో ఏపీ వ్యాప్తంగా 30 లక్షల మందికి ఇళ్లపట్టాలు అందించారని, వీటిలో 20 లక్షల మందికే ఇచ్చారని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది. వీటిలో 18.64 లక్షల ఇళ్ల నిర్మాణాలను చేపట్టగా.. అందులో 6.50 లక్షల ఇళ్లు పూర్తికాగా.. 4 లక్షల ఇళ్లు పునాది దశ కూడా దాటలేదని టీడీపీ ప్రభుత్వం చెబుతోంది.