ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన

ఏపీ(Andhra Pradesh) విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యావ్యవస్థ పై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుంది.


ఈ క్రమంలో ఇప్పటికే ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో పలు మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు(Intermediate students) మంత్రి లోకేష్(Minister Nara Lokesh) గుడ్ న్యూస్ చెప్పారు. 1,355 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లక్ష మందికి పైగా విద్యార్థులకు నిపుణులతో కూడిన స్టడీ మెటీరియల్‌తో పాటు ఫ్రీగా, JEE, NEET కోచింగ్, మెటీరియల్ కూడా అందించనున్నాం అని తెలిపారు.

దేశంలోనే తొలిసారి ప్రభుత్వ విద్యాసంస్థల్లో IIT/NEET లెవల్ అకడమిక్ సపోర్ట్ అందిస్తున్నామని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఈ క్రమంలో MPC, BiPC విద్యార్థులకు డైలీ కోచింగ్, ఎక్స్ ట్రా క్లాసులు, టెస్టులు ఉంటాయి. నాణ్యమైన విద్య ప్రతి ఒక్క విద్యార్థి హక్కు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ మోడల్ ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి విద్యార్థికి భవిష్యత్తులో పెద్ద కలలు కనడానికి, విజయాలు సాధించడానికి న్యాయమైన అవకాశాన్ని ఇస్తుందని అన్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.