వ్యాపారులకు గుడ్ న్యూస్.. యాక్సిస్ బ్యాంక్ కొత్త యాప్!

www.mannamweb.com


దేశంలో అనేక రకాల బ్యాంకులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగానికి చెందిన బ్యాంకులు ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. వివిధ రకాల స్కీమ్స్ ను ఆఫర్లను, అందిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. అదే విధంగా తరచూ వినియోగదారులకు కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్తుంటాయి. అలానే వ్యాపారస్తులకు కూడా తీపి కబురు చెబుతుంటాయి. అలానే తాజాగా ఓ ప్రైవేటు బ్యాంకు..వ్యాపారులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరి.. ఆ బ్యాంకు ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రధానమైన ప్రైవేటు బ్యాంకుల్లో యాక్సిస్ బ్యాంకు ఒకటి. ఎన్నో రకలా సేవలు అందిస్తున్న ఈ బ్యాంకు తాజాగా వ్యాపారస్తుల కోసం సూపర్ యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీసా, మింటోక్ భాగస్వామ్యంతో బిజినెస్ చేసే వారి కోసం నియోఫర్ మర్చంట్ అనే యాప్ ను ప్రారంభించి. ఇదే విషయాన్ని యాక్సిస్ బ్యాంకే స్వయంగా ప్రకటించింది. ఇక ఈ యాప్ ద్వారా సులభమైన యూజర్ ఇంటర్ ఫేస్, అన్ని రకాల పేమెంట్లను స్వీకరిస్తుంది.

అలానే వ్యాపార ఖర్చులకు సంబంధించిన సమాచారం ఇవ్వడం ఈ నియో మర్చంట్ యాప్ ప్రత్యేకత. అంతేకాక వ్యాపారులు చేసిన ట్రాన్సాక్షన్ ల రిపోర్టులను కూడా చెక్ చేసుకోవచ్చు. కార్డులు, యూపీఐ, ఎస్​ఎంఎస్​ పే ద్వారా డబ్బు తీసుకోవచ్చు. అలానే ఏదైనా సమస్య వస్తే నేరుగా యాప్ ​ద్వారానే ఫిర్యాదు చేయవచ్చు. రుణం​ కోసం కూడా దరఖాస్తు చేయవచ్చని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మొత్తంగా ఈ బ్యాంకు వ్యాపారుల సౌలభ్యం కోసం ఈ కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అలానే యాక్సిస్ బ్యాంకు ఫిక్స్ డ్ డిపాజిట్లకు సంబంధించి వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది.

వినియోగదారులను ఆకట్టుకునేలా ఈ బ్యాంకు కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటుంది. సాంకేతికతను వినియోగించుకుని అనేక సదుపాయాలను కస్టమర్లకు అందిస్తుంది. యాక్సిస్ బ్యాంకుకు కూడా ఎక్కువ సంఖ్యలో వినియోగదారులు ఉన్నారు. వారి సంఖ్యను మరింత పెంచుకునేందుకు తరచూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా ఈ కొత్త యాప్ ను తీసుకురావడం కూడా అందులో భాగమేనని బ్యాంకింగ్ నిపుణలు అభిప్రాయ పడుతున్నారు.