వాహనదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై ఆర్‌సీ, లైసెన్స్‌ వెంట పెట్టుకోనక్కర్లేదు.. పూర్తి వివరాలు..

www.mannamweb.com


ట్రాఫిక్ రూల్స్ మారాయ్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీసుకుని రోడ్డెక్కితే.. జేబుకు తడిసిమోపెడు అయినట్టే. ఒక డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాదు.. ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇలా వాహనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే కుదురుతుంది. లేదంటే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలే..

ట్రాఫిక్ రూల్స్ మారాయ్. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి తీసుకుని రోడ్డెక్కితే.. జేబుకు తడిసిమోపెడు అయినట్టే. ఒక డ్రైవింగ్ లైసెన్స్ మాత్రమే కాదు.. ఆర్‌సీ, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ ఇలా వాహనానికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ ఉంటేనే కుదురుతుంది. లేదంటే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలే. ఒకవేళ మీరెప్పుడైనా కంగారుగా ఇంట్లో లైసెన్స్, ఇతర పత్రాలను మర్చిపోయి.. మీ వాహనంతో సహా ట్రాఫిక్ పోలీసులకు తనిఖీల్లో దొరికారంటే..! కచ్చితంగా రూ. 5 వేల వరకు ఫైన్ చెల్లించాల్సిందే. అందుకే డ్రైవింగ్ లైసెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే మీకు ఇప్పుడొకటి చెప్పనా.? ఈ ఒక్క యాప్ ఉంటే.. లైసెన్స్, ఆర్‌సీ లాంటివి ఏవి కూడా మీ వెంట పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే.!

వాహనానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ను ఒకే చోట పొందేలా పలు యాప్‌లను రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. అవే Digilocker, mParivahan మొబైల్ యాప్‌లు. డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ లాంటి డాక్యుమెంట్స్‌ను మీరు ఈ యాప్‌లలో అప్‌లోడ్ చేసుకోవచ్చు. దీంతో మీకు అవసరమైనప్పుడల్లా.. ఎప్పుడైనా, ఎక్కడైనా లైసెన్స్, ఆర్‌సీని ఉపయోగించుకోవచ్చు. ఈ రెండు యాప్‌లు దేశవ్యాప్తంగా చెల్లుబాటులో ఉన్నాయ్. దీంతో డైవింగ్ చేసేటప్పుడు మీ దగ్గర అవసరమైన డాక్యుమెంట్స్ హార్డ్ కాపీలు లేకున్నా పర్లేదు. 2018వ సంవత్సరం నుంచి కేంద్ర రోడ్డు రవాణా శాఖ ఈ డిజిలాకర్, mParivahan యాప్‌లలో అప్‌లోడ్ చేసిన పత్రాలను ఒరిజినల్‌విగా నిర్ధారించాలని చెప్పడం.. మీ దగ్గర ఈ యాప్ ఉన్నా ఇకపై నో ప్రాబ్లం.