పెన్షన్ దారులకు గుడ్ న్యూస్ – ఇకపై ‘ముఖం’ చూపిస్తే చాలు..! డబ్బుల పంపిణీలో సరికొత్త మార్పులు

చేయూత పెన్షన్ల పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా మార్చేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బయోమెట్రిక్ సమస్యలను చెక్ పెట్టే దిశగా….ఫేసియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకురానుంది.


తద్వారా మరింత సులభంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేయాలని భావిస్తోంది. ఈ సరికొత్త వ్యవస్థను తీసుకొచ్చేందుకు ముహుర్తం కూడా ఫిక్స్ చేసంది.

ఇకపై ఫేసియల్‌ రికగ్నిషన్‌…

ప్రస్తుతం వేలిముద్రల ఆధారంగా పెన్షన్ల పంపిణీ జరుగుతోంది. అయితే వృద్ధుల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వారి వేలిముద్రలు అరిగిపోవటం వంటి సమస్యలతో డబ్బులు డ్రా చేయటం ఇబ్బందికరంగా మారుతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టేందుకు… ఫేసియల్‌ రికగ్నిషన్‌ వ్యవస్థను తీసుకురావాలని సర్కార్ నిర్ణయించింది. ఈ వ్యవస్థ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ అందేలా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంటుందని భావిస్తోంది.

  • చేయూత పేరుతో పెన్షన్ల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపుగా 44 లక్షల మంది పెన్షన్ దారులు ఉన్నారు. వీరిలో వృద్ధులు, వితంతువులు, గీత, బీడీ కార్మికులు,ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, ఫైలేరియా, హెచ్‌ఐవీ, డయాలసిస్‌ బాధితులు ఉన్నారు.
  • ఇప్పటివరకు వేలిముద్రల ఆధారంగా ఇస్తుండగా.. ఇకపై ఫేసియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) విధానాన్ని అమలు చేయనున్నారు. జూలై 29 నుంచి అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది.
  • తొలిదశలో తపాలా కార్యాలయాల ద్వారా పెన్షన్లు పొందే 23 లక్షల మందికే ఈ విధానం అమలు చేయనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా యాప్ ను కూడా ప్రభుత్వం సిద్ధం చేసింది.
  • ఈ కొత్త విధానంలో భాగంగా పెన్షన్లు పంపిణీ చేసే సిబ్బందికి శిక్షణ కూడా పూర్తి అయింది. జూలై 29 నుంచి కొత్త విధానాన్ని ప్రారంభించాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
  • చేయూత పెన్షన్లను పోస్టాఫీస్ ల ద్వారా పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. లబ్ధిదారుడు అక్కడికి వెళ్లిన తర్వాత ముందుగా ఫొటో తీసి ఆధార్‌లో ఉన్న ఫొటోతో సరిపోల్చుతారు. ఆ తర్వాత కొత్తగా తీసుకొచ్చిన యాప్‌లో అప్లోడ్ చేస్తారు. అనంతరం వారికి పెన్షన్ చెల్లిస్తారు.
  • ఎవరికైనా ఫొటోలు తీయలేని పరిస్థితి ఉన్నట్లయితే బయోమెట్రిక్‌ విధానం ద్వారా పింఛన్​ ఇస్తారు. ఇది కూడా ఇబ్బందికరంగా ఉంటే గ్రామ పంచాయతీ కార్యదర్శి లాగిన్ ద్వారా పంపిణీ చేస్తారు.

రాష్ట్రంలో 57 సంవత్సరాలు నిండిన వృద్ధులకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్​ అందిస్తున్న సంగతి తెలిసిందే. అర్హులను నిరంతం గురిస్తూ… ప్రతి నెల అందజేస్తోంది. ప్రస్తుతం వికలాంగులకు రూ. 3 వేలు ఇస్తుండగా… మిగతా వాళ్లకు రూ. 2 వేలు చెలిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.