ఏపీలో పెన్షన్ దారులకు గుడ్‌న్యూస్… డిసెంబర్ నెల NTR భరోసా పెన్షన్ విడుదల

న్టీఆర్ భరోసా పెన్షన్ స్కీం క్రింద నవంబర్ నెలలో 63,25,999 మంది లబ్దిదారులకు రూ 2738.71 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదల చేశామని రాష్ట్ర సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.


ఈ నెలలో నూతనంగా 8190 పెన్షన్ లు మంజూరు చేశామని అన్నారు. ఇందుకోసం అదనంగా రూ. 3. 28 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామని మంత్రి తెలియజేశారు. ఈ ఆర్ధిక సంవత్సరం ఇప్పటి వరకు రూ. 21280 కోట్లు పెన్షన్ల క్రింద లబ్ధిదారులకు అందజేయటం జరిగిందని అన్నారు. డిసెంబర్ 1 వ తేదిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం గోపాలపురం గ్రామ సచివాలయ పరిధిలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ మొత్తాన్ని అందజేస్తారని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది పింఛనుదారుల ఇంటి వద్దనే పింఛను పంపిణి చేస్తారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.