ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ‘ది రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ ఆ రోజే

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘ది రాజా సాబ్’ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్ విడుదలైంది.


హారర్ చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మాస్ ఎంటర్‌టైనర్ ‘ది రాజా సాబ్’ నుంచి మొట్టమొదటి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ఫస్ట్ సింగిల్ రెబల్ సాబ్ (RebelSaab)ను నవంబర్ 23న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్, జరీనా వాహాబ్‌, రిద్ది కుమార్ కథానాయికలుగా నటిస్తుండగా బోమన్ ఇరానీ, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.