రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ప్రభుత్వం మరో కీలక ప్రకటన

 రేషన్ కార్డు (Ration Card) ఉన్న వారికి కూటమి సర్కార్ తాజాగా గుడ్ న్యూస్ చెప్పింది. సరుకుల పంపిణీ కార్యక్రమం నెలలో ఏకంగా 15 రోజుల పాటు కొనసాగుతుందని ప్రకటించింది. అదేవిధంగా వృద్ధులు, దివ్యాంగులకు డీలర్లు వారి ఇంటి వద్దకే వెళ్లి బియ్యం, సరుకులు అందజేయనున్నారు. ఇక రేషన్ బియ్యం వద్దన్న వారికి వాటికి సరిపడా కంది పప్పు, మంచి నూనె, ఇతర నిత్యావసర సరుకులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కిలో బియ్యం మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.46 ఖర్చు చేస్తున్నాయి. ఒక రేషన్ కార్డులో నలుగురు సభ్యులు ఉన్నట్లయితే రూ. 920 విలువైన 20 కిలోల బియ్యం అందుకుంటున్నారు. కానీ, అందులో చాలా మంది ఆ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో కిలో రూ.10 నుంచి 20ల చొప్పున అమ్మేస్తున్నారు. ఈ క్రమంలో రేషన్ బియ్యం బ్లాక్ మార్కెట్‌కు వెళ్లకుండా చేసేందుకు బియ్యం వద్దన్న వారికి సరుకును ఇవ్వనున్నారు.


 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.