ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రెడ్ మీ మరో 5జీ ఫోన్ రిలీజ్‌కు రంగం సిద్దం చేసుకుంది. రెడ్ మీ 15సీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను త్వరలో ఇండియాలో రిలీజ్ చేయనుంది.
సెప్టెంబర్‌లో పోలాండ్‌లో ఇది మార్కెట్లోకి రాగా.. ఇప్పుడు ఇండియలో కూడా లాంచ్ కాబోతుంది. మూడు ర్యామ్ స్టోరేజ్‌లలో భారత్‌లో అందుబాటులోకి రానుంది. పోలాండ్‌లో బేస్ వేరియంట్ 4GB RAM + 256GB స్టోరేజ్ ధర రూ.19 వేలుగా ఉంది. అక్కడ డస్క్ పర్పుల్, మిడ్‌నైట్ బ్లాక్, మింట్ గ్రీన్ కలర్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఇండియాలో దీని ధర వివరాలు లీక్ అయ్యాయి. ఆ వివరాల్లోకి వెళ్తే..
ఫీచర్లు ఇవే..
MediaTek Dimensity 6300 చిప్‌సెట్, 6,000mAh బ్యాటరీ, HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.9-అంగుళాల LCD స్క్రీన్, 8GB వరకు LPDDR4x RAM, 128GB UFS 2.2 ఇంటర్నల్ స్టోరేజ్, Android 15-ఆధారిత HyperOS 2 ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 8-మెగాపిక్సెల్ సెల్పీ కెమెరా, వెనకవైపు 50-మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని సమాచారం.
ధర ఎంతంటే..?
ఇండియాలో 4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ. 12,499గా ఉండనుంది. ఇక 6GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999గా, 8GB RAM+ 128GB స్టోరేజ్ ధర రూ. 14,999గా ఉంటుందని సమాచారం. పోలాండ్‌లో బేస్ వేరియంట్ ధర రూ.19 వేల వరకు ఉండగా.. ఇండియాలో అంతకంటే తక్కువ ధరకు అందించనున్నారని తెలుస్తోంది.



































