ఏపీఎస్ఆర్టీసీ(Apsrtc) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులకు చెల్లించాల్సిన పీఆర్సీ(Prc)పై కీలక ప్రకటన చేసింది.
2017 పీఆర్సీ బకాయిలో 25 శాతం చెల్లింపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పెండింగ్‌లో ఉన్న రూ. 120 కోట్లలో రూ.60 కోట్లు మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. కాగా సంక్రాంతికి ఏపీఎస్ ఆర్టీసీకి బాగా లాభాలు వచ్చాయి.
ఆ సందర్భంగా ఆర్టీసీ అధికారులను, ఉద్యోగులను, సిబ్బందిని అప్పటి డీజీపీ, ఎండీ ద్వారకా తిరుమలరావు అభినందించారు. త్వరలో పెండింగ్ బకాయిలను కొంత మేర చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం 25 శాతం పీఆర్సీ చెల్లించేందుకు తాజాగా అంగీకరించింది. రెండు, మూడు రోజుల్లో వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది.� అలాగే మిగిలిన ఉద్యోగుల సమస్యలపై� మంత్రులతో చర్చించిన సీఎం చంద్రబాబు.. అన్నిపెండింగ్ ఫైల్స్‌ను ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.