సైరస్ పూనావాలా గ్రూప్ ప్రమోటర్ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ పూనావాలా ఫిన్‌కార్ప్ లిమిటెడ్ (పీఎఫ్ఎల్) షాప్‌కీపర్ లోన్ వ్యాపారాన్ని ప్రారంభించింది. చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణదారులు నగదు ప్రవాహం, స్టాక్ మేనేజ్మెంట్, కస్టమర్ మేనేజ్మెంట్ వంటి ప్రధాన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ సేవ ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారస్తులు తమ నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రిటైలర్లు, కిరాణా దుకాణాలకు అనుకూలమైన ఆర్థిక పరిష్కారాలను అందించడం పీఎఫ్ఎల్ యొక్క ప్రధాన లక్ష్యం. మొదటి దశలో 44 ప్రాంతాల్లో ఈ సేవను ప్రారంభించనున్నారు. షాప్‌కీపర్ లోన్ తో పీఎఫ్ఎల్ మొత్తం 4 కొత్త వ్యాపారాలను ప్రారంభించినట్లయింది.
పూనావాలా ఫిన్‌కార్ప్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ అరవింద్ కపిల్ వివరించినట్లు, “భారతదేశంలోని చిన్న రిటైలర్లు మన ఆర్థిక వ్యవస్థకు బెక్‌బోన్ లాంటివారు. కానీ, సరైన సమయంలో రుణ సదుపాయం లభించకపోవడం వారి వృద్ధికి అడ్డంకిగా మారుతోంది. షాప్‌కీపర్ లోన్ ద్వారా వారి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను పూరించి, దీర్ఘకాలిక వ్యాపార మద్దతును ఇవ్వడం మా లక్ష్యం. హైపర్‌కాంపిటిటివ్ రిటైల్ సెక్టార్‌లో వారి వ్యాపారాలను స్థిరపరచడానికి ఈ పథకం కీలకం.”
గోద్రెజ్ ప్రాపర్టీస్ అరుదైన ఘనత సాధించింది.
రియల్ ఎస్టేట్ డెవలపర్ గోద్రెజ్ ప్రాపర్టీస్ ఒక అరుదైన మైల్స్టోన్ సాధించింది. ఫైనాన్షియల్ ఇయర్ మరియు క్వార్టర్ల వారీగా అత్యధిక బుకింగ్స్ నమోదు చేసింది. Q4 FY25లో, బుకింగ్ వాల్యూ QoQ బేసిస్‌లో 87%, YoY బేసిస్‌లో 7% పెరిగి ₹10,163 కోట్లు చేరింది. 7.52 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో మొత్తం 3,703 యూనిట్లు విక్రయించబడ్డాయి.