చిరు వ్యాపారులకు శుభవార్త.. పీఎం స్వనిధి స్కీమ్ గడువు పెంపు

ప్రజల అభివృధ్ధి కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అనేక పథకాలను ఎప్పటికప్పుడు తీసుక వస్తూనే ఉంటాయి. ఇకపోతే, కేంద్ర ప్రభుత్వం వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రారంభించిన పీఎం స్వనిధి (PM SVANidhi) పథకాన్ని 2024 డిసెంబర్‌తో ముగిసింది.


అయితే తాజాగా 2030 మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ స్కీమ్ కింద ఇప్పటి వరకు రూ.7,332 కోట్లు రుణాలుగా మంజూరు చేసి 1.15 కోట్ల మందికి ప్రయోజనం కల్పించింది. ఇందులో 50 లక్షల మంది కొత్త లబ్ధిదారులు ఉన్నారు. నిజానికి ఈ పథకం కింద మూడు విడతల్లో లోన్లు ఇస్తారు. అందులో మొదట రూ.10,000 ఉన్నది ఇప్పుడు రూ.15,000కి, రెండో విడతలో రూ.20,000ని రూ.25,000కి, మూడో విడతలో రూ.30,000ని రూ.50,000కి పెంచారు. తొలి రెండు విడతల రుణాలను సకాలంలో చెల్లించిన వారికి మూడో విడతలో యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు ఇవ్వబడుతుంది. ఈ కార్డు ద్వారా అత్యవసర వ్యాపార, వ్యక్తిగత అవసరాలకు నిధులు వినియోగించుకోవచ్చు.

అంతేకాకుండా రిటైల్, హోల్‌సేల్ డిజిటల్ లావాదేవీలపై రూ.1,600 వరకు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా వీధి వ్యాపారులకు పెట్టుబడి సహాయం కల్పించడం, వ్యాపారాన్ని పెంచడం, ఆర్థిక నైపుణ్యం, డిజిటల్ ట్రాన్సక్షన్స్, మార్కెటింగ్ పరిజ్ఞానం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలు. జూన్ 1, 2020న ప్రారంభమైన ఈ పథకానికి అర్హులు నేరుగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.