Students గుడ్ న్యూస్.. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక హామీలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేసిన విషయం తెలిసిందే.


పెన్షన్ పెంపు, ఉచిత ఇసుక, క్యాంటీన్ల పునఃప్రారంభం, భూ హక్కుల చట్టం రద్దు, మెగా డీఎస్సీ, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు వంటి హామీలను నెరవేర్చారు. ఇదిలా ఉండగా, మిగిలిన హామీలను దశలవారీగా అమలు చేయడానికి సంకీర్ణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

ఈ నేపథ్యంలో, సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీపై ఆసక్తిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా 7,784 మంది విద్యార్థులను సైన్స్ అండ్ టూరిజం ట్రిప్‌కు తీసుకెళ్తామని వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి రూ. 200, ఇతర రాష్ట్రాలకు రూ. 2 వేలు ఖర్చు చేయనున్నారు. నిధుల కేటాయింపు, విద్యార్థుల ఎంపికపై సమగ్ర విద్యా డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు.