తెలంగాణ మహిళలకు గుడ్ న్యూస్… త్వరలోనే 18 సంవత్సరాలు దాటిన మహిళలకు రూ. 2500 అకౌంట్లో వేసే అవకాశం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే మహాలక్ష్మి స్కీంలో భాగంగా నెలకు 18 సంవత్సరాలు దాటిన మహిళలందరికీ నేరుగా అకౌంట్లో డైరెక్ట్ టు బెనిఫిషరీ ట్రాన్స్ ఫర్ పద్ధతిన 2500 రూపాయలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఆరు గ్యారెంటీలు పేరిట హామీలు అందించింది. ఇందులో అత్యంత ముఖ్యమైన మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2500 మహిళలందరికీ అందించే పథకాన్ని రూపొందించింది. అయితే ఈ స్కీం ఎంతో ఆర్థిక భారంతో కూడుకున్నది. వయోజనులైన మహిళలందరికీ 2500 రూపాయలు అందించాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి బడ్జెట్ పరిమితులు అంగీకరించవు. దీనికి తోడు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద రూ. 2 లక్షల రూపాయలు మాఫీ చేసింది. రైతుల కోసం హామీ ఇచ్చినటువంటి రైతు భరోసా స్కీం అమలు చేస్తోంది. అలాగే గృహ జ్యోతి స్కీమ్ కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా అమలు చేస్తోంది. దీంతోపాటు మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్ పథకం కూడా అమలవుతోంది.

అలాగే ఇందిరమ్మ స్కీం కింద పేదలకు తమ సొంత స్థలంలోనే ఇల్లు నిర్మించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఐదు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందులో భాగంగా ఇప్పటికే లబ్ధిదారులకు ఇల్లు నిర్మించుకోవడానికి దశలవారీగా నగదును అందిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే మహాలక్ష్మి స్కీం పై కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మహాలక్ష్మి స్కీంకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి మార్గదర్శకాలు వెలువబడలేదు.

ఇదిలా ఉంటే 6 గ్యారంటీల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సబ్‌ కమిటీకి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇతర సభ్యులుగా మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క స్కీం గురించి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశాలు జరుగుతున్నాయి. అయితే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ మహాలక్ష్మి స్కీం కింద మహిళలకు రూ. 2500 అందించనున్నారు. అయితే ఈ స్కీం కోసం కావాల్సిన నిధుల కోసం, అంచనాల కోసం కసరత్తు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కసరత్తు పూర్తయిన అనంతరం ఈ పథకం అమలుకు సంబంధించి త్వరలోనే మార్గదర్శ కాలు సైతం విడుదల అయ్యే అవకాశం ఉంది అని అధికారిక వర్గాల చర్చ నడుస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కీంను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నేపథ్యంలో త్వరలోనే కీలక ప్రకటన సైతం విలువరించి అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నటువంటి వార్తల ద్వారా రూపొందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాల గురించి అధికారిక సమాచారం కోసం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లు మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.