టెట్‌ అభ్యర్ధులకు గుడ్‌న్యూస్.. ఆన్‌లైన్‌ టెట్‌ మాక్‌ టెస్టులు వచ్చేశాయ్‌! డైరెక్ట్‌ లింక్‌ ఇదే

www.mannamweb.com


ఆంధ్రప్రదేశ్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్‌) జులై 2024 రాసే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి.

ఈ మేరకు పాఠశాల విద్యా విభాగం అధికారిక వెబ్‌సైట్‌లో అన్ని సబ్జెక్టులకు మాక్‌ టెస్ట్‌లు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎలాంటి పాస్‌వర్డ్‌ లేకుండానే వివిధ మాధ్యమాల్లో ప్రశ్నపత్రాల మాక్‌ టెస్టులు ఎవరైనా వినియోగించుకోవచ్చు. ఈ మాక్‌ టెస్ట్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో నిర్వహించే టెట్‌ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాయడానికి వీలుంటుంది. ఇక టెట్‌ హాల్‌టికెట్లు సెప్టెంబర్‌ 22 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఇక షెడ్యూల్‌ ప్రకారమే అక్టోబరు మూడు నుంచి టెట్‌ నిర్వహించున్నారు. అక్టోబర్‌ 3 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో ఈ పరీక్షలు జరుగనున్న సంగతి తెలిసిందే. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9.30 నుంచి 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌ టెట్ 2024 ఆన్‌లైన్‌ టెట్‌ మాక్‌ టెస్టుల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

సీఎస్‌ఎస్‌ఎస్‌ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ ఇదే

సెంట్రల్‌ సెక్టార్‌ స్కీమ్‌ ఆఫ్‌ స్కాలర్‌షిప్‌ ఫర్‌ కాలేజీ, యూనివర్సిటీ స్టూడెంట్స్‌(సీఎస్‌ఎస్‌ఎస్‌) శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇచ్చే ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి డైరెక్టర్‌ క్రితికాశుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ పూర్తి చేసినవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన పేర్కొన్నారు. గతంలో ఈ స్కాలర్‌షిప్‌ పొందిన వారు మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకోవడానికి అక్టోబరు 31 చివరి తేదీగా నిర్ణయించారు.

బీసీ విదేశీవిద్యకు దరఖాస్తుల ఆహ్వానం.. ఈ అర్హతలు తప్పనిసరి

మహాత్మా జ్యోతిబాఫులే విదేశీ విద్యా పథకం కింద ఫాల్‌ సీజన్‌కు అర్హులైన బీసీ, ఈబీసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్‌ బాలమాయాదేవి తెలిపారు. దరఖాస్తులను అక్టోబరు 15లోగా ‘ఈ పాస్‌’ వెబ్‌సైట్‌ ద్వారా చేసుకోవాలని తెలిపారు. అభ్యర్థుల వయసు 35 ఏళ్లలోపు ఉండాలని, ఇంజినీంగ్‌, మేనేజ్‌మెంట్, సైన్స్, వ్యవసాయం, మెడిసిన్, నర్సింగ్, సోషల్‌సైన్సెస్, అగ్రికల్చర్, హ్యుమానిటీస్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్నారు. విదేశీ యూనివర్సిటీల నుంచి ఐ-20, వీసా పొందిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.