ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన ధరలు.. ఇది కదా కావాల్సింది

www.mannamweb.com


ప్రస్తుతం ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువుల ధరలతో సామాన్యులు సైతం ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఉపశమనం కలిగించే ప్రకటన చేసింది. నిత్యవసర వస్తువుల అయిన బియ్యం, కందిపప్పు, స్టీమ్డ్ బియ్యం ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ కీలక ప్రకటన చేశారు. అయితే మార్కెట్లో కిలో కింది పప్పు ధర రూ.160గా ఉండగా, 10 రూపాయలు తగ్గించింది. దీంతో ప్రస్తుతం కిలో పప్పు ధర రూ.150కి చేరింది. అలాగే కిలో బియ్యం ధర రూ.48 ఉండగా, ఇప్పుడు రూ.47కు చేరింది.

రైతు బజార్‌లో ప్రత్యేక కౌంటర్లు:

ఇప్పుడు తగ్గించిన ధరలతో రైతు బజార్‌లో కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం తెలిపింది. ఈ తగ్గించిన ధరలతో గురువారం నుంచి విక్రయిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని జాయింట్‌ కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు. కాగా, రాష్ట్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన ఈ నెల రోజుల వ్యవధిలో బియ్యం, కంది పప్పు ధరలను రెండుసార్లు తగ్గించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చిందని ఆయన గుర్తు చేశారు.

ఈ నెల 11 నుంచి రైతు బజార్లలో కిలో కందిపప్పు ధర బహిరంగ మార్కెట్‌లో రూ.180 ఉండగా రూ.160కి, స్టీమ్డ్‌ రైస్‌‌ కేజీ రూ.55.85 నుంచి రూ.49కి, ముడి బియ్యం కేజీ రూ.52.40 నుంచి రూ.48కి తగ్గించారు. ఇప్పుడు మరోసారి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.