పేదలకు గుడ్ న్యూస్.. ఇళ్ల మంజూరుపై ప్రభుత్వం కీలక ప్రకటన

 ప్రతి ఒక్కరికీ ఇళ్లు(Housing) ఉండాలన్న లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం(Ap Government) అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 50 వేళ్ల ఇళ్లను మంజూరు చేసింది.


మరిన్ని ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తోంది. వచ్చే 5 వరకు ఈ సర్వే కొనసాగించనుంది.

పేదలు అప్పటి వరకూ కూడా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. పట్టణ ప్రాంత అర్హులందరికీ ఇళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై 75.1 శాతం సంతృప్తిగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ప్రజల స్పందనను ఆర్టీజీఎస్(Rtgs) ద్వారా తెలుసుకుంటున్నట్లు వెల్లడించింది. 16 నెలల్లో రూ.7.65 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వెచ్చినట్లు తెలిపింది. 7.28 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.