నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) భారీ శుభవార్త చెప్పారు. సోమవారం సూర్యాపేటలోని తుంగతుర్తిలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మరో రెండు సంవత్సరాల్లో కొత్తగా లక్ష ఉద్యోగాలు(Job Recruitment) సృష్టించి నిరుద్యోగులను ఆదుకునే బాధ్యతను తానే తీసుకుంటానని ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50 వేల పైచిలుకు ఉద్యోగాలు భర్తీ చేశామని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి.. మళ్లీ వాళ్లే కోర్టుల్లో కేసులు వేయించి నిరుద్యోగుల జీవితాలతో ఆట ఆడుకున్నారని విమర్శించారు. అలాంటి బీఆర్ఎస్‌కు వచ్చే స్థానిక ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మమ్మల్ని మీరు గెలిపించారు.. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ను ఓడించారు.. ఇన్ని చేసిన మిమ్మల్ని లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపించుకునే బాధ్యత తమది అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక్కటంటే.. ఒక్కటి కూడా బీఆర్ఎస్‌ను గెలవనీయొద్దని చెప్పారు.
రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉంది.. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగింది. BRS పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇస్తే గోదావరి నీళ్లు తుంగతుర్తికి ఎందుకు తేలేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
































