ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్క్ ఫ్రమ్ హోమ్ కొత్త సర్వే (Work From Home New Survey 2025) ను ప్రారంభించింది. ఈ సర్వే ద్వారా ఐటీఐ (ITI), Diploma, డిగ్రీ (Degree), Graduation, Post Graduation అర్హత కలిగిన అభ్యర్థులకు వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.
ఏపీ ప్రభుత్వం కొత్త సర్వే చేపట్టింది. వర్క్ ఫ్రమ్ హోం సర్వే 2025కు శ్రీకారం చుట్టింది. ఇందులో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇతర ఉన్నత చదువులు చదివిన వారి వివరాలు సేకరించనుంది. సర్వేలో పాల్గొని వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులకు వర్క్ ఫ్రమ్ హోం కేటిగిరి ఉద్యోగాలు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అందుకు అంతా సర్వేలో పాల్గొని తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఏపీ వర్క్ ఫ్రమ్ హోం సర్వే (Work From Home Survey 2025) ముఖ్యాంశాలు
– సర్వే ప్రారంభం: 1 ఆగస్టు 2025
– అర్హత: ITI, Diploma, Any Degree, Graduation, PG లేదా హయ్యర్ ఎడ్యుకేషన్
– సర్వే నిర్వహణ: గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది (AP GSWS Employees)
– పేరు నిర్ధారణ: GSWS సిస్టంలో ఆటోమేటిక్‌గా వచ్చే వారికి మాత్రమే అవకాశం
సర్వేకు అవసరమైన డాక్యుమెంట్లు
– మొబైల్ నెంబర్ (OTP వెరిఫికేషన్)
– ఈమెయిల్ ఐడి (OTP వెరిఫికేషన్)
– విద్యార్హత సర్టిఫికేట్ (ఫోటో/స్కాన్ కాపీ)
– పాస్ అవుట్ ఇయర్, GPA/Percentage
– చదివిన సంస్థ వివరాలు
AP Work From Home Survey 2025 జరిగే విధానం ఇదీ..
– GSWS Employees Mobile App డౌన్లోడ్ చేసి, లాగౌట్ & లాగిన్ అవ్వాలి.
– Search by Cluster / Search by UID ద్వారా పేరు చెక్ చేయాలి.
– Face/OTP/Biometric ద్వారా వ్యక్తి ధృవీకరణ.
– వ్యక్తిగత వివరాలు & విద్యార్హత వివరాలు నమోదు చేసి సర్టిఫికేట్ అప్లోడ్.
– చివరగా Submit చేసి సర్వే పూర్తి చేయాలి.
సర్వేలో అడిగే ప్రశ్నలు (Survey Questions)
– తెలిసిన భాషలు
– విద్యార్హత & స్పెషలైజేషన్
– మార్కులు లేదా GPA
– పాస్ అవుట్ ఇయర్
– ఒరిజినల్ సర్టిఫికేట్ అప్లోడ్
– చదివిన లొకేషన్
– ఇతర అదనపు అర్హతలు
ఏపీ వర్క్ ఫ్రమ్ హోం సర్వే వివరాలు (AP Work From Home Survey Report)
సర్వే రిపోర్టు జిల్లాల వారీగా, మండలాల వారీగా, సచివాలయాల వారీగా ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
AP Work From Home Survey Report – అధికారిక లింక్ https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WFHMISReport
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/WFHMISReport
ప్రభుత్వ ఉద్దేశ్యం
ఈ సర్వేలో పాల్గొని వివరాలు సమర్పించిన నిరుద్యోగ యువతకు ప్రభుత్వం తమ వంతుగా నేరుగా ఇంటి వద్ద నుండే ఉద్యోగ అవకాశాలు ఇవ్వబోతున్నట్లు తెలిపింది. అర్హులైన అభ్యర్థులు ఈ సర్వేలో తప్పకుండా పాల్గొని భవిష్యత్తులో వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాలు పొందేలా చూడాలని అధికారులు చెబుతున్నారు.
































