నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. JE పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్

ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సువర్ణవకాశం. రైల్వే ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ(రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్) శుభవార్త చెప్పింది.


భారీ సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్‌లను రిలీజ్ చేసింది. అందులో భాగంగా ఆర్ఆర్బీ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల్లో 8,868 అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులు ఉన్నాయి. మిగతా 2,569 ఖాళీలతో జూనియర్ ఇంజినీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి.

అయితే.. రైల్వే రిక్రూట్ర్‌మెంట్ బోర్డులో మొత్తం 2,569 జూనియర్ ఇంజినీర్(JE) పోస్టులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే(SCR) పరిధిలో 103 పోస్టులు ఉన్నాయి. డిప్లొమా, బీటెక్, బీఈ అర్హత గల అభ్యర్థులు ఈ రోజు(అక్టోబర్ 31) నుంచి వచ్చే నెల(నవంబర్) 30 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక ప్రక్రియలో CBT-1, CBT-2 పరీక్షలు ఉంటాయి. అంటే.. ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్ష, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, రైల్వే మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు వెబ్‌సైట్ https://www.rrbapply.gov.in/#/auth/landing ను సందర్శించండి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.