ఆంధ్రవిశ్వవిద్యాలయం యుఈఐజీబీ ఆధ్వర్యంలో నవంబర్ 19న 6 కంపెనీలు నిర్వహించే మెగా జాబ్ మేళాలో 600 పోస్టులకు ఇంటర్వ్యూలు, 18-35 ఏళ్ల అర్హులైన అభ్యర్థులు హాజరు కావచ్చు.
ఆంధ్రవిశ్వవిద్యాలయం ఎంప్లాయీస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, నేషన్ కెరీర్ సర్వీస్ (యుఈఐజీబీ) ఆధ్వర్యంలో నవంబర్ 19వ తేదీన ఉదయం 10.30 గంటల నుంచి ఉద్యోగ మేళా జరుగుతుందని యుఈఐజీబీ డిప్యూటీ చీఫ్ కె. దొరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈరోజు ఏయూలోని యుఈఐజీబీ విభాగంలో హాజరుకావాలన్నారు.
నిరుద్యోగ యువతకు ఉద్యోగా కల్పనే ధ్యేయంగా ఈ మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. నవంబర్ 19న ఉదయం 10 గంటలకు 6 ప్రముఖ కంపెనీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. 600 వివిధ పోస్టుల భర్తీ కోసం ఇంటర్వ్యూలు అనకాపల్లి , విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో అర్హులైన నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చని అని తెలిపారు. ఈ జాబ్ కు సంబంధించి, టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, బీటెక్, ఐటీఐ, డిప్లమో, బి/డి/ఎం ఫార్మ సీ పూర్తి చేసిన వారంతా ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చన్నారు.
ఎంపికైన అభ్యర్థులకు అర్హతల ఆధారంగా రూ.11వేల నుంచి రూ.25వెలు వేతనం వరకు ఉంటుందని, విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో ఉద్యోగం చేయాల్సి ఉంటుందని తెలిపారు. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారంతా హాజరు కావచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాలకు 9294952449 , 0891-284484 ఫోన్ నెంబరులో సంప్రదించాలని సూచించారు. ఫోన్ నెంబర్లకు సంప్రదించాలని తెలిపారు.
ఈ వెబ్సైట్ లో https://www.ncs.gov.in , https://employment.ap.gov.in రిజిస్ట్రేష్రన్ చేసుకుని అడ్మిట్ కార్డుతో హాజరు కాగలరని, స్పాట్ రిజిస్ట్రేషన్ కలదని తెలిపారు. పైన తెలిపిన విధంగా విద్యార్థులందరూ 10 గంటలకు చేరుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేసారు.
ఇప్పటి వరకు అనేక మంది విద్యార్థులకు మెగా జాబ్ మేళా ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు అని తెలియజేశారు. విద్యార్థులందరూ చదువుకొని ఖాళీగా ఉండకుండా మెగా జాబ్ మేళాలో పాల్గొని ఉద్యోగ అవకాశాన్ని కల్పించుకోవాలని తెలియజేశారు. తమ నైపుణ్యాన్ని బట్టి పలు కంపెనీల్లో తీసుకుంటారని తెలియజేశారు. ఎప్పటికప్పుడు మెగా జాబ్ మేళా ద్వారా ఉపాధి కల్పన చేయడం చేస్తామని తెలిపారు.

































