Loans : పెళ్లి తర్వాత మీ భార్య పేరు మీద ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అవును మీరు విన్నది నిజమే. వివాహానంతరం సామాజిక బాధ్యతతో పాటు మీ భార్య పేరు మీద అనేక ప్రయోజనాలను పొందవచ్చు.
మరి ఆ ప్రయోజనాలు ఏమిటి? దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
పెళ్లయిన తర్వాత కూడా చాలా మంది ఆడపిల్లలు చదువుకోవాలని కోరుకుంటారు. కానీ పెళ్లయ్యాక చదువులకు డబ్బు కావాలి. అలాంటప్పుడు ఆమె పేరు మీద విద్యా రుణం తీసుకుంటే భారీ రాయితీ పొందే అవకాశం రుణశాఖ కల్పించింది. అదేంటంటే.. భార్య చదువు కోసం బ్యాంకు నుంచి రుణం తీసుకుంటే వారికి భారీ రాయితీ లభిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎలా పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రత్యేకించి కొన్ని రకాల రుణాలు దీర్ఘకాలిక రుణాలు కాబట్టి, తిరిగి చెల్లించాల్సిన వడ్డీ చాలా ఎక్కువగా ఉంటుంది.
కానీ ఇప్పుడు మీరు మీ భార్య చదువు కోసం డబ్బు తీసుకున్నట్లయితే, మీకు విద్యా రుణం చెల్లింపు నుండి మినహాయింపు ఉంటుంది. అయితే ఇది ఆదాయపు పన్ను నిబంధనలలోని section 80 ప్రకారం పేర్కొనబడింది. మరియు ఈ రుణంపై మీరు సుమారు 8 సంవత్సరాల పాటు వడ్డీపై పన్నును క్లెయిమ్ చేసుకోవచ్చు. కానీ మీరు ఈ విద్యా రుణాన్ని ప్రముఖ బ్యాంకు లేదా ప్రభుత్వ ఆమోదిత ఆర్థిక సంస్థల నుండి మాత్రమే పొందవచ్చు. మరి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు అధికారులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో భార్య పేరుతో రుణాలు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు పొందవచ్చు.