పర్యాటకులకు గుడ్ న్యూస్.. పాపికొండలు పిలుస్తున్నాయ్

www.mannamweb.com


పర్యాటకులకు గుడ్ న్యూస్ చెప్పింది ఏపీ ప్రభుత్వం.. పాపికొండల పర్యాటకానికి అధికారులు అనుమతిని ఇచ్చారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. నేటి నుంచి పాపికొండల పర్యటకానికి అనుమతి, బోట్లను సబ్ కలెక్టర్ కల్పశ్రీ, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు.

అల్లూరి జిల్లా దేవీపట్నం మండలంలోని పాపికొండల పర్యాటకానికి అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నేటి నుంచి పాపికొండల పర్యటకానికి అనుమతి, బోట్లను సబ్ కలెక్టర్ కల్పశ్రీ, స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. పర్యటకానికి వెళ్ళే సమయంలో ప్రమాదం జరిగితే ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే విధంగా అవగాహనలో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో మాక్ డ్రిల్ నిర్వహించారు. పాపికొండలు వెళ్లే పర్యాటకులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చూడాలని బోట్ల యజమానులకు సబ్ కలెక్టర్ సూచించారు.

పర్యటకుల నుండి ఏ విధమైన కంప్లైంట్ వచ్చిన చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ కల్పశ్రీ వెల్లడించారు. పాపికొండలు వెళ్లే బోట్లు ఫిట్నెస్, వాటి లైసెన్స్ రికార్డులను పరిశీలించి, బోట్ పై గోదావరిపై బోట్‌పై స్టికర్ వేశారు. ఏటా సగటున 50,000 నుండి 70,000 మంది పర్యాటకులు AP మరియు తెలంగాణ నుండి గండి పోచమ్మ దేవాలయం మరియు పోచవరం నుండి నది మీదుగా విహారయాత్ర చేసి పాపికొండలను సందర్శిస్తారు.