పర్యాటకులకు గుడ్‌న్యూస్.. విశాఖలో కళ్ళు చెదిరే మాయా వరల్డ్.. ఈ ప్లేస్‌కి వెళ్లారా?

విశాఖలో TU142 విమానం మ్యూజియం వద్ద మాయా వరల్డ్ గ్లాస్ హౌస్ ప్రారంభం, అద్దాల ప్రతిబింబాలు, ప్రత్యేక గదులు, ఫొటోషూట్లకు ఆకర్షణగా మారింది.


సుందర నగరం విశాఖలో మరో టూరిజం ఎట్రాక్షన్ రెడీ అయింది. ఆర్కే బీచ్ రోడ్‌లో కొత్త అద్దాలమేడ సందర్శకుల కోసం ప్రారంభమైంది. మాయా వరల్డ్ పేరుతో నిర్మించిన ఈ అద్దాల అద్భుతాన్ని TU142 విమానం మ్యూజియం ఆవరణలో ఏర్పాటు చేశారు. సుమారు రెండున్నర కోట్లతో ఈ గ్లాస్ హౌస్‌ను నిర్మించినట్టు నిర్వాహకులు కెప్టెన్ NR కుమార్ తెలిపారు.

దేశంలోనే మొదటిసారిగా విశాఖలో మాయ వరల్డ్ ఏర్పాటు చేశారు. ఇది విశాఖకి వచ్చే పర్యాటకులను మరింతగా ఆకర్షిస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తోంది ఈ మాయా వరల్డ్.

ఎటు చూసినా అద్దాలతో ఒక విధమైన భ్రాంతిని సందర్శకులకు కలిగించడమే ఈ గ్లాస్ హౌస్ ఎఫెక్ట్. ఈ మ్యూజియంలో అద్దాలతో విభిన్నమైన అంశాలతో గదులను తయారుచేసిన విధానం చాలా విచిత్రంగా ఉంటుంది. ఇక్కడ అంతరిక్షం, పువ్వులతో కూడిన గార్డెన్, దట్టమైన అడవి వంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లతో ఏర్పాటు చేసిన గదులు ఆకట్టుకుంటున్నాయి.

ఫొటోషూట్లకు, రీల్స్‌ తీసుకోవడానికి, వీడియోలకు ఈ మాయా వరల్డ్ చాలా బాగుంటుందని ఆయన అన్నారు. అద్దాలతో తయారుచేసిన మాయ వరల్డ్ చాలా బాగుందని సందర్శకులు అంటున్నారు. లోపలికి వెళ్ళగానే నిజంగా అద్భుతంగా ఉందని అంటున్నారు.

మొత్తం అద్దాలు ఉండడంతో మంచి అనుభూతి కలుగుతుందని అంటున్నారు. చిన్నపిల్లల అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారని అంటున్నారు. ఫొటోలు తీసుకోవడానికి వీడియోలు తీసుకోవడానికి మాయ వరల్డ్ చాలా బాగుందని అంటున్నారు. చూసిన ప్రతి ఒక్క పర్యాటకులు చాలా బాగుందని ఆనంద వ్యక్తం చేస్తున్నారు. మీరు కూడా విశాఖ వచ్చినప్పుడు ఓసారి ట్రై చేయండి మరి.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.