ఓ వైపు పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు చాలీ చాలనీ జీతాలు టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోకపోవడంతో అప్పులు చేస్తున్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్స్ తీసుకుంటున్నారు. మరి మీకు కూడా అర్జెంట్ గా డబ్బులు కావాలంటే గూగుల్ పే నుంచి సులభంగానే పొందొచ్చు. యూజర్లకు గూగుల్ పే రూ. 15,000 అందిస్తోంది. ఈ డబ్బులను ఎలా పొందాలంటే?
గూగుల్ పే అందుబాటులోకి వచ్చాక చెల్లింపులన్నీ ఆన్ లైన్ లో జరుగుతున్నాయి. కోట్లాది మంది యూజర్లను కలిగిన గూగుల్ పేలో నిత్యం వేల కొద్ది ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఇక గూగుల్ పే తన యూజర్ల కోసం లోన్ అందిస్తోంది. దాని కోసం శాచెట్ లోన్ అనే ప్లాన్ తీసుకొచ్చింది. దీని ద్వారా రూ. 15000 వరకు లోన్ తీసుకోవచ్చు. చిన్న వ్యాపారుల కోసం ఈ లోన్ తీసుకొచ్చినట్లు గూగుల్ పే తెలిపింది. గూగుల్ పే వాడే వారికి ఈ లోన్ ఇచ్చేందుకు డీఎంఐ ఫైనాన్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది గూగుల్ పే. శాచెట్ లోన్ ను 7 రోజుల నుంచి 12 నెలల్లో చెల్లించొచ్చు. ఈ లోన్ ను పొందేందుకు ఎక్కువగా డాక్యుమెంట్స్ అవసరం లేదు.. ఈజీగానే పొందొచ్చు.
గూగుల్ పే ఇచ్చే రుణంపై వడ్డీ రేటు సంవత్సరానికి 14 శాతం నుంచి 36 శాతం వరకూ ఉంటుంది. 18 ఏళ్లు, ఆపై ఉన్నవారికే ఈ లోన్ ఇస్తారు. 30 వేల ఆదాయం కంటే తక్కువ ఉన్న వారికి లోన్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, పాన్ కార్డు ఉండాలి. దరఖాస్తు దారు సిబిల్ స్కోర్ కనీసం 750 ఉండాలి. ఈ రుణాల్ని రూ. 111 నుంచి రీపేమెంట్ అమౌంట్‌తోనే తిరిగి చెల్లించొచ్చని గూగుల్ పే వెల్లడించింది.
ఎలా పొందొచ్చంటే?
గూగుల్ పే బిజినెస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. తర్వాత లోన్ ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీరు గూగుల్ పే శాచెట్ లోన్ ఎంచుకొని ఎంత రుణం కావాలో వివరాలు ఇవ్వాలి. అవసరమైన సమాచారం అందించిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత కొన్ని నిమిషాల్లోనే లోన్ మంజూరవుతుంది. ఈ లోన్ తో మీ తక్షణ అవసరాలను తీర్చుకోవచ్చు.