గ్రామ(Village), వార్డు సచివాలయాల్లో(ward Secretariats) పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలనే డిమాండ్‌పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
ఉద్యోగులకు పదోన్నతుల కల్పనపై అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తులు ప్రారంభించింది. ఇందుకోసం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. జీవో సైతం జారీ చేసింది.
ఇక ఈ కమిటీలో పది మంది మంత్రులు పని చేయనున్నారు. జీవోఎంలో సభ్యుడిగా పవన్ కల్యాణ్‌కూ ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల పదోన్నతులపై ఈ కమిటీ శరవేగంగా అధ్యయనం చేయనుంది. త్వరలోనే కార్యచరణను మొదలుపెట్టనుంది. ఈ కమిటీ ఇచ్చే నివేదికపైనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనున్నాయి.
































