కేంద్రం గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి బియ్యంతో పాటు 9 సరుకులు ఫ్రీ

www.mannamweb.com


దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న నిరుపేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ కార్డులు అందిస్తాయి. ఆహారభద్రత కోసం లబ్దిదారులకు ఉచితంగా రేషన్ అందిస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం ఫ్రీ రేషన్ స్కీమ్ కింద రేషన్ కార్డు ఉన్నవారికి రేషన్ బియ్యం అందిస్తున్న విషయం తెలిసిందే. కరోనా కష్టకాలంలో నిరుపేదలకు ఉచిత బియ్యం పంపిణీ చేయడం మొదలు పెట్టింది కేంద్రం. రేషన్ కార్డు కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలకు ఉపయోగపడతాయి. తాజాగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

భారత దేశంలో నిరుపేదలకు ప్రభుత్వ ఫ్రీ రేషన్ స్కీమ్ కింద.. 90 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నారు. ఇప్పటి వరకు రేషన్ కార్డుదారులకు బియ్యం ఫ్రీగా ఇచ్చే వారు. ఇప్పుడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డుదారులకు 9 నిత్యావసర వస్తువులు ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిలో గోధుమలు, పప్పులు, ధాన్యాలు, చక్కెర, ఉప్పు, ఆవనూనె, పిండి, సోయాబీన్, మసాలా దినుసులు ఉన్నాయి. ఉచితంగా బియ్యానికి బదులుగా ఈ సరుకులు అందజేస్తారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

పేద ప్రజలకు ఆరోగ్యం మెరుగుపరిచేందుకు.. వారి ఆహారంలో పౌష్టికాహారం స్థాయిని పెంచేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని వల్ల ప్రజా జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని కేంద్రం అభిప్రాయపడుతుంది. ప్రస్తుతం బయట మార్కెట్ లో నిత్యవసర సరుకుల ధర పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇన్ని ఉపయోగాలు ఉన్న రేషన్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నారు. అర్హులైన వారు దగ్గరలోని ఆహార, పౌర సరఫరా శాఖ ఆఫీస్ కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని అంటున్నారు