ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు శుభవార్త చెప్పింది. 8వ వేతన సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా ఉద్యోగుల జీతాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఒక చర్చ సాగుతోంది.


దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30 నుంచి 34 శాతం జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పెరిగిన ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకుని వేతన సంఘం ఈ మేరకు సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ పెంచిన జీతాలు 2026 జనవరి నుంచి అమలులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు ఒక చర్చ సాగుతోంది.

ఈ 8వ వేతన సంఘం సిఫార్సుల ద్వారా 11 మిలియన్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుందని ప్రచారం జరుగుతోంది. 2016లో 7వ వేతన సంఘాన్ని మోదీ సర్కార్ నియమించింది. మళ్లీ ఈ ఏడాది 8వ వేతన సంఘాన్ని కేంద్రం ఏర్పాటు చేసింది. ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన సంఘాన్ని కేంద్రం నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఇక 7వ వేతన సంఘం అత్యల్పంగా 14 శాతం మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెంచిన విషయం విదితమే.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.