Good News ఒక్క రోజులోనే భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతుందంటే.?

www.mannamweb.com


మహిళలకు అద్దిరిపోయే శుభవార్త. గత కొద్దిరోజులుగా భారీగా పెరుగుతూపోతున్న బంగారం ధరలకు కాస్త బ్రేక్ పడింది. గడిచిన నాలుగైదు రోజులు పోలిస్తే.. పసిడి రేట్లు ఏకంగా రూ. 1300 వరకు దిగివచ్చాయి. ప్రపంచ మార్కెట్‌లోనే కాదు.. బులియన్ మార్కెట్‌లోనూ బంగారం ధరల క్షీణత కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై రూ.10 తగ్గి రూ.71500కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.65,540కు చేరింది. అటు మంగళవారం 22 క్యారెట్ల బంగారం ధర వెయ్యి తగ్గగా.. 24 క్యారెట్ల గోల్డ్‌పై రూ. 1,090 తగ్గిన విషయం తెలిసిందే.

ఇక గోల్డ్‌ ధరలు మాదిరిగానే వెండి రేట్లు కూడా తగ్గాయి. గత మూడు రోజులు.. కేజీ వెండిపై రూ. 1100 తగ్గింది. బుధవారం దేశంలోని పలు ప్రాంతాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఢిల్లీ, ముంబై, కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.82,900కి చేరింది. అలానే చెన్నైలో కిలో వెండి రూ. 86,400 ఉండగా.. బెంగళూరులో కిలో వెండి రూ. 83,300 దగ్గర కొనసాగుతోంది. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలో వెండి ధర రూ. 86,400గా ఉంది.

ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇలా..
ఢిల్లీలో బంగారం ధర రూ. 71,650

హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 71,500

చెన్నైలో బంగారం ధర రూ. 72,370

ముంబైలో బంగారం ధర రూ. 71,500

కోల్‌కతాలో బంగారం ధర రూ. 71,500

బెంగళూరులో బంగారం ధర రూ. 71,500