ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ సంస్థ గురించి అందరికి తెలిసిందే.ఎప్పటికప్పుడు వినియోదారుల అవసరాలకు అనుగుణంగా అన్ని రకాల ఉత్పత్తులను ఈ ఫ్లిప్ కార్ట్ సంస్థ అందిస్తోంది. అలాగే వివిధ రకాల ప్రొడక్ట్స్ ను అతి తక్కువ ధరలతో కష్టమర్లను ఆకర్షించడంలో ఈ ఫ్లిప్ కార్డ్ సంస్థ ఎప్పుడు ముందుటుంది. ఇప్పటికే ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అయిన ఫ్లిప్‌కార్ట్ యాప్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్, ఆఫ్‌లైన్ పేమెంట్స్, సూపర్ కాయిన్స్ , క్యాష్ బ్యాక్ , మిలిస్టోన్ బెనిఫిట్స్ , బ్రాండ్ వోచర్‌లు వంటి సేవలెన్నో ఈ యూపీఐలో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫ్లిప్ కార్డ్ సంస్థ మరో కొత్త సర్వీస్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ప్రముఖ డిజిటల్ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ మరో కొత్త సర్వీస్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ సేవలనేవి వినియోగాదారులకు ప్రయోజకరంగా ఉంటాయి. ఇంతకి ఆ సేవలు ఏమిటంటే.. ఫ్లిప్ కార్ట్ తాజాగా బస్ టెకెట్ బుకింగ్ సేవలను ప్రారంభించింది. ఇందుకోసం ఫ్లిప్‌కార్ట్ సంస్థ రాష్ట్ర రవాణ కార్పొరేషన్లు, ప్రైవేట్ అగ్రిగేటర్లతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ప్రస్తుతం ఈ రావాణా సేవలనేవి బెంగళూరు, ఛండీగఢ్, ఢిల్లీ, జైపూర్, ఇండోర్, అహ్మదాబాద్, హైదరాబాద్, ముంబై, చెన్నై వంటి ప్రాంతాల్లో టికెట్ బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చింది. అలాగే దీనిలో ఎలాంటి చార్జీలు లేకుండా బస్ టికెట్‌ను బుకింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. కాగా, ఈ కొత్త సేవలు ప్రారంభ సందర్భంగా.. ఈ నెల 15 వరకు 20 శాతం వరకు రాయితీని కల్పించనుంది.ఇక పై దేశవ్యాప్తంగా 25 వేలకు పైగా రూట్లలో 10 లక్షలకు పైగా బస్సులకు టికెట్ బుకింగ్ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్ విమాన టికెట్, హోటల్ బుకింగ్ సేవలను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఈ బస్ టికెట్ సేవలన కూడా ఫ్లిప్ కార్డ్ ప్రారంభించింది. కాగా, ఈ ఫీచర్ ప్రస్తుతం ఈ యాప్ లో Android, iPhone వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ యాప్ బస్ బుకింగ్ ఈజీ యాక్సెస్, సులభమైన రీఫండ్‌లు, రూ. 50 వరకు సూపర్ కాయిన్స్ రిడెంప్షన్ ద్వారా ఆఫర్లు, 24×7 వాయిస్ హెల్ప్‌లైన్ వంటి ఫీచర్లను కూడా అందిస్తుంది. దీంతో పాటు లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులకు ఫ్లాట్ 15% తగ్గింపుతో పాటు 5% అదనపు తగ్గింపును కూడా అందిస్తోంది. అంతేకాకుండా.. ఫ్లిప్‌కార్ట్ తన యాప్‌లో లక్కీ డ్రా పోటీని కూడా నిర్వహిస్తోంది. ఇక్కడ రూ. 1 వద్ద బస్సు టిక్కెట్‌లను అందిచబోతుంది. అయితే వారణాసి, అయోధ్య, హరిద్వార్, తిరుపతికి వెళ్లాలనుకునే కస్టమర్‌లకు కంపెనీ ఫ్లాట్ 25 శాతం తగ్గింపు బస్సు బుకింగ్ కూపన్‌ను కూడా అందిస్తోంది.