పెట్రోల్ ధరల నుంచి ఉపశమనం పొందాలంటే వాహనదారులకు బెస్ట్ ఆప్షన్ ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైక్, కార్లను వాడడమే. ఎలక్ట్రిక్ టూవీలర్ ల ధరలు పెట్రోల్ తో నడిచే బైక్ ల ధరల రేంజ్ లో ఉండడంతో ఈవీల కొనుగోలు పట్ల మొగ్గు చూపుతున్నారు. ఈవీల వాడకంతో వాహనదారులకు డబ్బు ఆదా అవుతుంది. అంతే కాకుండా పర్యావరణానికి మేలుచేసినట్లు అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలకు వస్తున్న ఆదరణతో ఆటో మొబైల్ కంపెనీలు నయా టెక్నాలజీతో అద్భుతమైన ఫీచర్లతో టూ వీలర్లను రూపొందించి మార్కెట్ లోకి విడుదల చేస్తున్నాయి. మరి మీరు ఈ మధ్యకాలంలో ఎలక్ట్రిక్ బైక్ కొనాలనే ప్లాన్ లో ఉన్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ప్రముఖ కంపెనీకి చెందిన స్కూటీపై కళ్లు చెదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. కేవలం రూ. 57 వేలకే సొంతం చేసుకోవచ్చు.
ప్రముఖ ఎలక్ట్రిక్ టూవీలర్ సంస్థ ఓలా కస్టమర్లను ఆకర్షించేందుకు స్కూటర్లపై అద్భుతమైన ఆఫర్లను ప్రకటిస్తూ ఉంటుంది. సేల్స్ పెంచుకునేందుకు భారీ డిస్కౌంట్ ఆఫర్లను కస్టమర్లకు అందిస్తూ ఉంటుంది. ఓలాకు చెందిన ఎస్1ఎక్స్ బైక్ పై బంపరాఫర్ అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ. 79,999 కాగా, ప్రస్తుతం రూ. 69,999కే లభిస్తుంది. అయితే ఆఫర్ లో భాగంగా ఈ బైక్ ను కేవలం 57 వేలకే సొంతం చేసుకోవచ్చు. ఈ బైక్ సింగిల్ ఛార్జ్ తో ఏకంగా 190కి.మీలు ప్రయాణించొచ్చు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది. కేవలం 3.3 సెకన్లలో గంటకు 0 నుంచి 40కిమీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ వెల్లడించింది. ఓలా ఎస్1ఎక్స్ ని మొత్తం ఏడు విభిన్న రంగు ఎంపికలలో కొనుగోలు చేయవచ్చు. ఇందులో రెడ్ వెలాసిటీ, మిడ్‌నైట్, వోగ్, స్టెల్లార్, ఫంక్, పోర్సిలైన్ వైట్, లిక్విడ్ సిల్వర్ వంటి రంగులు ఉన్నాయి. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఫేమ్-II) పథకం ద్వారా సబ్సిడీని అందిస్తున్నారు. ఈ సబ్సిడీలో భాగంగా ఈ స్కూటర్ ను 57 వేలకే సొంతం చేసుకోవచ్చు.