ఒప్పో సంస్థ భారత్ మార్కెట్లో ఈ సంవత్సరం తొలిభాగంలో ఒప్పో K13 సిరీస్‌ను లాంచ్ చేసింది. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన ఒప్పో K13x 5G ను ప్రస్తుతం డిస్కౌంట్ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఈ హ్యాండ్‌సెట్ అనేక బెస్ట్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ కిందపడినా ఎటువంటి డ్యామేజీ కాకుండా ఉండేలా అనేక ప్రత్యేక ఫీచర్‌లను కలిగి ఉంది. IP65 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్ :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం ఒప్పో వెబ్‌సైట్‌లో 4GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.11999, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.12999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను పొందవచ్చు.
SBI, యాక్సెస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, DBS బ్యాంకు, ICICI, HDFC, ఫెడరల్ బ్యాంకు, IDFC ఫస్ట్ బ్యాంక్ కార్డులపై రూ.2000 డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.9999 ధరకే సొంతం చేసుకోవచ్చు. బ్రీజ్, మిడ్‌నైట్ వైలెట్, సన్‌సెట్ పీచ్ వంటి కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఫోన్‌లోని అంతర్గత విభాగాలు డ్యామేజీ కాకుండా :
ఒప్పో K13x 5G స్మార్ట్‌ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 360 డిగ్రీల ఆర్మర్ బాడీ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. దీంతోపాటు Sponge Absorption ఫీచర్.. ఏదైనా సందర్భంలో ఫోన్ కిందపడితే, ఫోన్‌లోని అంతర్గత విభాగాలు డ్యామేజీ కాకుండా ప్రొటెక్షన్ ఇస్తుంది. మొత్తంగా ఈ అన్ని ఫీచర్లు.. ఫోన్ కిందపడినా డ్యామేజీ కాకుండా రక్షణ కల్పిస్తాయి.
ఈ ఒప్పో స్మార్ట్‌ఫోన్ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ అల్ట్రా బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే గ్లౌజ్ టచ్, స్ల్పాష్ టచ్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఫలితంగా గ్లౌజ్, తడి చేతులతోనూ డిస్‌ప్లేను ఆపరేట్ చేసేందుకు అవకాశం ఉంది.
3 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఒప్పో హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 128GB UFS 2.2 స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత ColorOS 15 పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుందని ఒప్పో హామీ ఇచ్చింది.
50MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలున్నాయి. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 2MP కెమెరాలను ఉంటుంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
































