డిమార్ట్‌ కంటే తక్కువ ధరకే సరుకులు.. ఇక్కడ ఒక నెల బడ్జెట్‌తో రెండు నెలల గ్రోసరీ

 రోజుల చాలా మంది ఇంట్లోని నెలవారి సరుకులు కొనేందుకు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లకు వెళ్తున్నారు. ఎందుకంటే అక్కడ ఆఫర్స్‌ ఉంటాయి. తక్కువ ధరకు సరుకులు లభిస్తాయని..


కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. అక్కడ ఆఫర్స్ ఉన్నప్పటికీ.. ట్యాక్స్, జీఎస్టీ అని బిల్‌ కౌంటర్‌కు వచ్చే సరికి రేట్లు వాచిపోతాయ్.

అందుకే కొందరు మహిళలు ఏం చేస్తున్నారంటే.. ఈ జీఎస్టీ, ఇతర ఛార్జీలు తగ్గించుకునేందుకు కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. పెద్ద సూపర్ మార్కెట్స్, మాల్స్‌కు వెళ్లి సరుకులు కొనడం కన్నా.. తమ కాలనీలో ఉండే కిరాణ స్టోర్స్‌కు వెళ్లి కావాలసని వస్తువులను తెచ్చుకుంటున్నారు.

ఇలా కిరాణ స్టోర్స్‌కు వెళ్లడం ద్వారా కేవలం వారికి కావలసిన సరుకులు మాత్రమే కొంటున్నారు. ఇలా చేయడం ద్వారా వాళ్లకు భారీగా డబ్బు ఆదా అవుతుంది. అదే కాకుండా పెద్ద పెద్ద సూపర్ మార్కెట్‌లకు వెళ్తే.. అక్కడ కనిపించే కొన్ని వస్తువులకు ఆకర్షితులై అవి తమకు పెద్దగా అవసరం లేకపోయినా వాటిని కొంటున్నారు. దీని వల్ల అక్కడ భారీగా డబ్బును అనవసరంగా ఖర్చు పెడుతున్నారు.

ఈ కిరాణ షాప్స్‌లో కొనుగోలు చేయడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏమిటంటే.. ఇక్కడ సూపర్‌ మార్కెట్స్‌తో పోల్చుతో ధరల్లో ఎక్కువ తేడా ఏమి ఉండదు.. ఇంచుమించు ధరలు ఒకేలా ఉంటాయి. కానీ విక్రయదారుల వద్ద వస్తువు గురించి చర్చించి దాని ప్రయోజనాలు తెలుసుకొని తీసుకోవచ్చు. అలానే కొన్ని సార్లు క్రెడిట్‌లు కూడా పెట్టుకోవచ్చు. ఈ వెసులు బాటు మనకు సూపర్ మార్కెట్‌లో ఉండదు.

కాబట్టి చాలా మంది ఇప్పుడు కిరాణం షాపుల్లో దొరకని వస్తువుల కోసం అవసరం ఉన్నడు మాత్రమే మాల్స్‌కు వెళ్తున్నారు. ఇలా చేయడం ద్వారా వారు ఎంతో కొంత డబ్బును ఆదా చేసుకోగలుగుతున్నారు. అలాగే సమయానికి డబ్బు లేకుండా ఈ కిరాణ షాపుల నుంచి అరువుగా తెచ్చుకొని ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఈ విదంగా మాల్స్ కంటే కారణ షాపులు బెస్ట్‌గా మారుతున్నాయి.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.