టెక్ దిగ్గజం గూగుల్‌లో (Google) ఉద్యోగుల తొలగింపు అంశం ఇటీవల వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా 200 మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది.
వీరంతా జెమిని, ఏఐ టూల్స్ ప్రాజెక్టులలో పనిచేస్తున్న వారేనని సమాచారం. అయితే, ముందస్తుగా ఎటువంటి సమాచారం లేదా హెచ్చరికలు లేకుండానే ఈ చర్యలు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తమను అకస్మాత్తుగా తొలగిస్తున్నట్లు ప్రకటించారని కొందరు కాంట్రాక్టు ఉద్యోగులు పేర్కొనడం గమనార్హం.
ఏఐ సాంకేతికతను మరింత మెరుగుపరిచే ప్రాజెక్టులపై ఈ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్టర్లలో మాస్టర్స్, పీహెచ్‌డీ డిగ్రీలు ఉన్నవారేనని, సూపర్ రేటర్స్‌గా గుర్తింపు పొందిన వారేనని తెలిసింది. అయితే, వీరి తొలగింపుపై స్పందించిన గూగుల్.. వారితో నేరుగా తమ సంస్థకు సంబంధం లేదని పేర్కొన్నట్లు సమాచారం. ఓ నియామక ఏజెన్సీ లేదా దాని సబ్ కాంట్రాక్టర్ ఉద్యోగులేని చెప్పినట్లు సమాచారం.
































