ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు బియ్యం తో పాటు పప్పు (చిరు) ధాన్యాలు సరఫరా చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు గతంలోనే అధికారుల నుంచి వివరాలు సేకరించిన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ (Minister Nadendla Manohar.).. ప్రభుత్వంతో చర్చించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తమ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) ద్వారా రేషన్ కార్డుదారులకు (Ration card holders) సబ్సిడీ రేట్లలో పప్పు ధాన్యాలు అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ఈ నిర్ణయం ప్రజలకు అవసరమైన పోషకాహారాన్ని సరసమైన ధరలలో అందుబాటులోకి తీసుకు రావడం, అలాగే ఆర్థిక భారాన్ని తగ్గించడం లక్ష్యంగా మారింది. కాగా ఈ పథకం అమలుపై మంత్రి నాదేండ్ల మనోహర్ (Minister Nadendla Manohar.) మాట్లాడుతూ.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని స్కూళ్లు, హాస్టల్లకు నాణ్యమైన బియ్యాన్ని పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. అలాగే రేషన్ షాపుల ద్వారా చిరుధాన్యాలు సరఫరా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతన్నాయని, దీనిపై కేంద్ర ప్రభుత్వం (Central Govt) తో ఇప్పటికే చర్చించినట్లు మంత్రి తెలిపారు.
































