రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ ఉద్యోగం.. నెలకు రూ.1,42,400 వరకు జీతం..!

www.mannamweb.com


నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ప్రముఖ ప్రభుత్వ విభాగంలో ఉద్యోగాలకు లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆధ్వర్యంలోని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ గ్రేడ్ B (CBDT Processing Assistant Grade B) పోస్టుల భర్తీకి 2024, డిసెంబర్ 31న నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఖాళీల వివరాలు
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో సిబిడిటి మొత్తం 8 పోస్టులను భర్తీ చేయనుంది. అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి 30 రోజులలోపు, అంటే జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఎవరు అర్హులు?
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు తప్పనిసరిగా కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో లేదా కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తున్న ఉద్యోగి అయి ఉండాలి. అంతేకాదు, ఈ కింది అర్హతల్లో ఏదో ఒకటి మీకు ఉండాలి:

– ఆప్షన్ A
కంప్యూటర్ అప్లికేషన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ (MCA) లేదా కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్‌లో ఎంటెక్ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ ఇంజనీరింగ్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ.

– ఆప్షన్ B
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ; కనీసం రెండేళ్లు ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ అనుభవం, అందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ సైతం ఉండాలి.

– ఆప్షన్ C
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ డిగ్రీ లేదా ఇంజనీరింగ్ డిగ్రీ; కనీసం మూడేళ్లు ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ అనుభవం, అందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి.

– ఆప్షన్ D
డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అక్రెడిటేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్ (DOEACC) ప్రోగ్రామ్ కింద ‘A’ లెవెల్ డిప్లొమా లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్; ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్‌లో కనీసం 3 సంవత్సరాల అనుభవం, అందులో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఉండాలి.

* ఏజ్ లిమిట్
దరఖాస్తులు సబ్మిట్ చేసే చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయసు 56 ఏళ్లు మించకూడదు.

* అప్లికేషన్ ప్రాసెస్
ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తులను అవసరమైన అన్ని డాక్యుమెంట్లతో పాటు ఈ కింది చిరునామాకు పంపాలి.

డైరెక్టరేట్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ (సిస్టమ్స్),
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT),
గ్రౌండ్ ఫ్లోర్, E2, ARA సెంటర్, ఝండే వాలన్ ఎక్స్‌టెన్షన్, ఢిల్లీ.
చివరి తేదీ దాటిన తర్వాత వచ్చిన అప్లికేషన్లను రిజెక్ట్ చేస్తారు.

సెలక్షన్ ప్రాసెస్
ఈ నియామకం డిప్యుటేషన్ పద్ధతిలో జరుగుతుంది. అంటే, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వ శాఖలు లేదా కేంద్ర పాలిత ప్రాంతాలలో పనిచేస్తున్న అధికారుల నుంచి సెలక్ట్ చేస్తారు. ఇందుకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అలాగే సాధారణ ప్రజలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. అర్హతలు, అనుభవం, సీనియారిటీ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు, శాలరీ
దీనికి అప్లై చేసుకునే వారు పైసా కూడా చెల్లించనక్కర్లేదు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు శాలరీ లభిస్తుంది. ఇది 7వ వేతన సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటుంది. మరిన్ని వివరాల కోసం డిపార్ట్‌మెంట్ అధికారిక వెబ్‌సైట్ incometaxindia.gov.in విజిట్ చేయవచ్చు.