సోషల్ మీడియా అంటేనే ఉలిక్కిపడుతున్నారు కొంతమంది. ముఖ్యంగా ఏపీలో..! పవన్ కల్యాణ్ ఫైర్ అయిన క్షణం నుంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఓ కొత్త మార్పు అయితే కనిపిస్తోంది.
ఎంత వరకు నిజమో గానీ.. 15వేల మందికి నోటీసులు. ఏకంగా 200 మంది వరకు అరెస్ట్. ఒక్కొక్కరిపై కనీసం 20కి పైగా కేసులు.
ఇదీ ప్రస్తుత పరిస్థితి అంటున్నారు రాజకీయ ప్రత్యర్థులు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తే.. ఏకంగా పార్టీ మొత్తం కదిలిపోతోంది. ప్రతిపక్ష నేతలు రోడ్లపైకి వస్తున్నారు.
ఒక ప్రజా సమస్యపై స్పందించడానికో, ఓ ఆందోళన చేయడానికో, ఓ ఉద్యమం నడపడానికి కూడా రానివాళ్లంతా పరిగెత్తుకొస్తున్నారిప్పుడు. సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తే అంత ఉలికిపాటా? ఎందుకని..? వర్రా రవీందర్‌రెడ్డిని అరెస్ట్ చేస్తే..
ఆ లింక్ సజ్జల నుంచి ఎంపీ అవినాశ్‌రెడ్డి మీదుగా ఇంకెటో వెళ్తోంది. అసలేం జరుగుతోంది ఏపీ రాజకీయాల్లో..? ఈ సోషల్ మీడియా అరెస్టులు ఇంకెంత దూరం వెళ్తాయి..? అసలు టార్గెట్ ఎవరు? ఫుల్ డిటైల్స్..